నీళ్లు తగ్గుతున్నయ్.. అవసరాలు పెరుగుతున్నయ్

Updated By ManamWed, 07/11/2018 - 23:35
chandu-lal
  • నీటి మట్టాన్ని పెంచుకోవాలి: మంత్రి చందూలాల్

chandu-lalహైదరాబాద్: నిత్యజీవితంలో నీటి అవసరం ఎంతో ఉందని.. వ్యవసాయానికీ నీటి లభ్యత కీలకమని మంత్రి చందూలాల్ పేర్కొన్నారు. జనాభా పెరుగుదల నేపథ్యంలో పెరుగుతున్న అవసరాలకు సరిపడా నీటి లభ్యత గగనంగా మారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్లుగా నీటి మట్టాలను గరిష్ఠంగా పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా నీటి వినియోగంపై చర్చ జరుగుతుందన్నారు. బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ గ్లోబల్ వాటర్ సెక్యూరిటీ సదస్సు అక్టోబర్ 3వ తేది నుండి 6 వ తేది వరకు తాజ్ కష్ణ హోటల్ జరగనుంది తెలిపారు. జనాభాకు తగట్టు ఆహార పదార్థాలను పెంచాలి అంటే నీటి మట్టం పెంచాలని సూచించారు. వాటర్ మేనేజ్‌మెంట్ ద్వారా నీటి వాడకంపై అంతర్జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ జరుగుతుందన్నారు. ఈ సదస్సులో సుమారు 20 దేశాల నుంచి ఐదు విభాగాల్లో 500 మంది వ్యవసాయ ఇంజనీర్లు, జీవ శాస్త్ర విభాగానికి చెందిన ఇంజనీర్లతోపాటు మరో రెండు వందల మంది స్సీకర్లు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో ఇండియా, అమెరికాలోని ప్రసిద్ధ యూనివర్సిటీ మిచిగాన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ అర్కనాస్‌కు చెందిన బయోలాజికల్ ఇంజనీర్లతోపాటు అమెరికా సొసైటీ ఆప్ ఆగ్రోనమీతోపాటు టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీకి చెందిన వ్యవసాయ, బయోలాజికల్ శాస్త్రవేత్తలతోపాటు ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రి క ల్చర్‌కు చెందిన శాస్త్రవేత్తలు పాల్గొంటారని తెలిపారు. అనంతరం చిత్రమయి ఆర్ట్ గ్యాలరీ డాక్యూమెంటరీ ఫిల్మ్‌ను మంత్రి చందూలాల్ కార్యదర్శి బుర్రా వెంకటేశంతో కలిసి ఆవిష్కరించారు. మాదాపూర్‌లోని రెండున్నర ఎకరాల్లో 49 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొని ఉన్న స్టేట్ ఆర్ట్ గ్యాలరీ అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నామన్నారు.

Tags
English Title
Water is falling. Requirements are growing
Related News