వీడియో: తండ్రి పోలీస్ అయితేంటీ.. ఇంత దారుణమా..! 

Updated By ManamFri, 09/14/2018 - 14:30
Delhi Police, cop's son, girl, Tilak Nagar
  • ఢిల్లీలోని తిలక్ నగర్‌లో ఘటన.. వీడియో వైరల్

  • అమ్మాయిని ఎంత దారుణంగా కొడుతున్నాడో చూడండి..

  • కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. 

Delhi Police, cop's son, girl, Tilak Nagarన్యూఢిల్లీ: ఆడపిల్లనే కనికరం లేకుండా ఓ అమ్మాయిని అత్యంత దారుణంగా చావబాదాడో ఓ యువకుడు. ఈ ఘటన ఈ నెల 2న మధ్యాహ్నం ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో మధ్యాహ్నం తిలక్ నగర్‌లో బీపీఓ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. నిందితుడు రోహిత్ స్నేహితుడు అలి హసన్‌ బీపీఓ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నాడు. తన తండ్రి పోలీసు అనే అహంకారంతో మృగంలా ప్రవర్తించిన 21ఏళ్ల రోహిత్‌కు ఏ ఉద్యోగం లేదని, ఇటీవలే బీపీఓలో ఉద్యోగంలో చేరినట్టు తెలిపారు. నిందితుడు తండ్రి అశోక్ సింగ్ సెంట్రల్ ఢిల్లీలోని నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్నారు.
 

నిందితుడు ఢిల్లీ పోలీసు అధికారి అశోక్ సింగ్ తోమార్ కుమారుడు రోహిత్ తోమర్ (21)గా విచారణలో పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టారు. పోలీసు అధికారి అశోక్ తోమార్‌ను సంప్రదించేందుకు యత్నించగా, ఆయన ఫోన్ స్విచ్చాప్ అయినట్టు పోలీసులు తెలిపారు. 

English Title
Watch: Delhi Police cop's son thrashes girl in Tilak Nagar
Related News