కోహ్లీకి అనుష్క హగ్.. వీడియో వైరల్! 

Updated By ManamMon, 07/09/2018 - 16:25
Anushka Sharma, Virat Kohli hug, India clinch series win

Anushka Sharma, Virat Kohli hug, India clinch series winబ్రిస్టల్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ జంట ప్రస్తుతం లండన్‌లో ఎంజాయ్‌ చేస్తోంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భర్త కోహ్లీ అడుగుజాడల్లో నడుస్తూ అతనికి మద్దుతుగా సతీమణి అనుష్క కూడా వెంట వెళ్లింది. బాలీవుడ్‌ నటిగా అనుష్క బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా తన భర్తకు మద్దతుగా అన్నివేళలా నిలుస్తోంది. బ్రిస్టల్ వేదికగా ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో ఇంగ్లాండ్‌లో తొలిటీ20 సిరీస్‌ను గెలిచి భారత్ చరిత్ర సృష్టించింది.

బ్రిస్టల్ స్టేడియంలోని గ్యాలరీలో ఇతర ఆటగాళ్ల కుటుంబ సభ్యులతో కలిసి అనుష్క కూర్చొని మ్యాచ్‌ను వీక్షించారు. అనుష్కతో పాటు అశిష్ నెహ్రా భార్య, సాక్షి ధోనీ, జీవా, శిఖర్ ధావన్ పిల్లలంతా ఒకేచోట కూర్చొని మ్యాచ్‌లో భారత్ విజయాన్ని ఆశ్వాదించారు. మ్యాచ్ అనంతరం భర్త కోహ్లీ వద్దకు చేరుకున్న అనుష్క శుభాకాంక్షలు చెబుతూ ఆలింగనం చేసుకుంది. పోస్ట్ మ్యాచ్ షో ప్రసారం అవుతున్న సమయంలో కుమార్ సంగక్కర మాట్లాుడుతుండగా, వెనుక వీరుష్క జంట ఇలా హగ్ చేసుకోవడం కనిపించడంతో అభిమానులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదే ఆ వీడియో..

 

Virushka hug after the series Win ❤️❤️ #virushka #viratkohli #anushkasharma

A post shared by Sara (@virushka_folyf) on

English Title
Watch: Anushka Sharma, Virat Kohli hug after India clinch series win
Related News