ఆధారాలుంటే బయటపెట్టండి: పురందేశ్వరి

Updated By ManamFri, 09/14/2018 - 13:10
Warrant Issued Against Chandrababu Naidu, reacts purandeswari
chandrababu arrest warrent-purandeswari

విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అరెస్ట్ వారెంట్ జారీ కావడంపై బీజేపీ మహిళా నేత పురందేశ్వరి స్పందించారు. చంద్రబాబు వారెంట్‌తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. పురందేశ్వరి శుక్రవారమిక్కడ మాట్లాడుతూ... కోర్టు సాధారణ ప్రక్రియలో భాగంగానే చంద్రబాబుకు వారెంట్ ఇచ్చిందన్నారు.

అన్నింటికీ కేంద్రామే కారణమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అసత్య ప్రచారాలు చేయడం సరికాదని, అన్నింటినీ తమ పార్టీకి ఆపాదించడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీకి ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు. అరెస్ట్ వారెంట్‌పై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలని ఆమె సూచించారు.

సానుభూతి కోసమే టీడీపీ డ్రామాలు: కన్నా
అమరావతి: ప్రజల సానుభూతి కోసమే టీడీపీ డ్రామాలు ఆడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మండిపడ్డారు. ముద్దాయిగా ఉన్న వ్యక్తి కోర్టుకు గైర్హాజరు అయితే నాన్‌ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేస్తారన్నారు. చంద్రబాబు విచారణకు హాజరు కాకుండా కోర్టును అగౌరవపరుస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.

English Title
Warrant Issued Against Chandrababu Naidu: reacts purandeswari
Related News