గణేశ్ ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు..

Updated By ManamFri, 09/14/2018 - 19:48
Vulgar dances, Lord Ganesha, Vinayaka Chavithi
  • విజయవాడ శివారులోని గణేశుడి ఉత్సవాల్లో ఘటన

  • నలుగురు మహిళలు సహా ఎనిమిది మంది అరెస్ట్

Vulgar dances, Lord Ganesha, Vinayaka Chavithiవిజయవాడ: వినాయకచవితిని పురస్కరించుకొని నవరాత్రి వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న అశ్లీల నృత్యాలను పోలీసులు అడ్డుకున్నారు. నలుగురు మహిళలు సహా మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ శివారు సమీపంలో వినాయక చవితి ఉత్సవాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

అక్కడి కొందరు యువకులు మహిళలను తీసుకొచ్చి గురువారం రాత్రి గణేశుడి ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు చేయించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని నృత్యాలు చేస్తున్న మహిళలను, నిర్వాహకులను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

English Title
Vulgar dances performed at Lord Ganesha Celebrations
Related News