తెలంగాణలో భారీగా పోలింగ్ 

The voter turnout in Telangana assembly elections is 49 percent till 1 pm

హైదరాబాద్ : తెలంగాణలో భారీగా పోలింగ్ నమోదు అవుతోంది. శుక్రవారం ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ ఆ తర్వాత ప్రతి గంట గంటకు పోలింగ్ శాతం పెరుగుతూ వస్తోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. మధ్యాహ్నం 1గంటకు  49 శాతం పోలింగ్ నమోదైంది. 

ఇదే స్థాయిలో పోలింగ్ కొనసాగితే సాయంత్రానికి 80శాతం పైగా నమోదు అయ్యే అవకాశం ఉంది. కాగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చెదురుమదురుగా ఈవీఎంలు మొరాయించినా... ఆ తర్వాత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కాగా తన స్వగ్రామం చింతమడకలో ఓటు వేసిన కేసీఆర్ కూడా...హైదరాబాద్‌లో భారీగా పోలింగ్ శాతం పెరిగిందన్నారు.

జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు:

 • హైదరాబాద్‌లో 37శాతం

 • రంగారెడ్డి జిల్లాలో 29శాతం 

 • మహబూబ్‌నగర్‌ జిల్లాలో 30శాతం 

 • నల్గొండ జిల్లాలో 31శాతం 

 • సూర్యాపేట జిల్లాలో 34శాతం 

 • ఆదిలాబాద్‌ జిల్లాలో 32శాతం 

 • కరీంనగర్‌ జిల్లాలో 35శాతం 

 • ఖమ్మం జిల్లాలో 32శాతం 

 • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 25శాతం 

 • వరంగల్‌ జిల్లాలో 34శాతం 

 • జనగామ జిల్లాలో 25శాతం 

 • జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 32శాతం

 • మెదక్‌ జిల్లాలో 35శాతం

 • సిద్దిపేట జిల్లాలో 30శాతం 

 • సంగారెడ్డి జిల్లాలో 30శాతం 

 • నిజామాబాద్‌ జిల్లాలో 33శాతం 

 • కామారెడ్డి జిల్లాలో 28శాతం 

 • కుమ్రం భీం జిల్లాలో 25శాతం

 • పెద్దపల్లి జిల్లాలో 28శాతం 

 • జగిత్యాల జిల్లాలో 26శాతం 

 • సిరిసిల్ల జిల్లాలో 26శాతం 

సంబంధిత వార్తలు