ఓటు ప్రజాస్వామ్యానికి ప్రతీక

Election

రాజ్యాంగబద్ధంగా ఏర్పాటయ్యే ప్రభుత్వ వ్యవస్థ ఎలా ఉండాలో నిర్ణయించుకునే అధికారం, అవకాశం ఓటుహక్కు ద్వారా ప్రతి వయోజనుడూ ప్రభుత్వాలను, వ్యవస్థలను నిర్మించుకోవచ్చు. అమలు కాని, సాధ్యంకాని, అనువు కాని పనులు చేస్తామని, ఉచిత హామీలు గుప్పించి అరచేతిలో స్వర్గం చూపించే వారికి కాకుండా సాధ్యమయ్యే హామీలు ఇచ్చిన వారికి, నిక్కచ్చిగా, నిజాయితీగా ఉండేవారికి, కనీస ప్రజావసరాలు తీర్చే  వారికి, ప్రతినిధికి ఓటువేసి ప్రజాస్వామ్యాన్ని పరిడవిల్లించే ప్రయత్నం చేయాలి. 
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 71 యేళ్ళు అయ్యా యి. ఈ కాలంలో 16 లోక్‌సభలు, చాలా శాసనసభల ఎన్నికలు, ఎన్నో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగా యి. ఈ ఎన్నికలలో పౌరులు తమ పవిత్రమైన ఓటు హక్కును వినియోగించుకొని, వారికి నచ్చిన పాలకు లను ఎన్నుకున్నారు. నచ్చని నాయకులను  ఓడిస్తు న్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ బాగా ఇబ్బంది కలి గించే విషయం ఏమిటంటే ఇప్పటికీ ఓటింగ్ సరళిని పరిశీలిస్తే ఓటు హక్కును వినియోగించుకున్న వారి శాతం డ్బ్బైకి మించడం లేదు. ఇది ఆందోళన కలిగిం చే విషయం. ఓటు హక్కు నమోదు విషయం, ఓటు హక్కు వినియోగించే విషయం. యువత అవ గాహన స్థాయిని పెంచాల్సిన ఆవశ్యకత  ప్రభుత్వంపై ఉన్నది.

దేశంలో ఇప్పటికి  16 సార్వత్రిక ఎన్నికలు జర గ్గా మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలో 17.3 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 61.2 శాతం మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాటి నుంచి గత 2014 ఎన్నికలో 83.40 కోట్ల మం ది ఓటర్లుండగా అందులో 66.3 శాతం మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది ప్రజా స్వామ్యానికి భంగం కలిగించే విషయం. తెలంగాణ రాష్ట్రంలో 2009 సార్వత్రిక ఎన్నికల లో ఓటింగ్ 67.71 శాతం ఉండగా, 2014 ఎన్నికలలో ఓటింగ్ 72 శాతంగా ఉన్నది. జిల్లాల వ్యాప్తంగా పరి శీలిస్తే నల్లగొండ జిల్లాలో  81శాతం ఉండగా రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓటింగ్ 53 శాతం  (2009 సార్వత్రిక ఎన్నికలలో 58 శాతం)  ఉన్నది. రానురాను దిగజారుతున్నది. ఇది సమాజానికి అనారోగ్యమైన పరిస్థితి. ఇప్పుడు జరుగనున్న తెలం గాణ ద్వితీయ అసెంబ్లీ ఎన్నికలలో కనీసం 90 శాతవైునా ఓటింగ్ జరగాలి. అందుకు ప్రజలు, ప్రభు త్వం తమ బాధ్యతగా వివిధ పద్ధతుల ద్వారా ప్రజలకు ఓటు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.  తెలంగాణ రాష్ట్రంలో 2,80,64,680 ఓటర్లు  ఉండగా అందులో పురుషులు 1.38 కోట్లు, మహిళలు 1.35 కోట్లు, థర్ద్ జండర్ 2,663 మంది 32,574 పోలింగ్ స్టేషన్‌లలో వారి వారి ఓటు హక్కును విని యోగించుకోబోతున్నారు. ఓటు ప్రతి పౌరుడి/వ్యక్తి  అస్తిత్వానికి ప్రతీక. సమాజ స్థితి, గతులను మార్చే బలియమైన శక్తి ఓటుకున్నది.
 గ్రామీణ ప్రాంత ప్రజలు వారి బతుకుతెరువు కోసం పట్టణ ప్రాంతాలకు వలస వెళతారు. అలాంటి వారి సంఖ్య తక్కువేమీ కాదు. ఎన్నికల సమయంలో అలాంటి వారందరినీ ఎన్నికలో ఓటువేసేందుకు ప్ర భుత్వం వివిధ సౌకర్యాలు కల్పించాలి. ఈ విషయం లో ప్రజలకు మరింత అవగాహన, చైతన్యం కలిగిం చాల్సిన అవసరమున్నది. మరణించిన ఓటర్లను ఎప్ప టి కప్పుడు తొలగించి, అనునిత్యం ఓటర్ల జాబితాను సవరించాలి. పంచాయతీ/మున్సిపాలిటీలలో  మరణ ధ్రువీకరణ పత్రం జారీచేసిన రోజే, ఆ ఓటరు పేరు దానంతట అదే తొలగించబడేలా సాఫ్ట్‌వేర్ ప్రభు త్వం/ఎలక్షన్ కమిషన్  రూపొందించాలి. ప్రజలకు ఓటర్ల జాబితా ఎక్కడ లభ్యమవు తుందో సరైన అవగాహన లేదు. ఓటర్ల జాబితా కావాలంటే నిత్యం ఎమ్మార్వో లేదా ఎంపీడీవో కా ర్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వాటిని  జిరా క్స్ తీసుకోవాలన్నా ఖర్చుతో కూడుకున్నది. అలా కా కుండా గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పోస్టా ఫీసులు, గ్రంథాలయాలల్లో ఓటర్ల జాబితాను అందు బాటులో ఉంచాలి. మండల గ్రంథాలయాలలో ఆ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన ఓటర్ల జాబితాలు లభ్యమయ్యేలా ఎన్నికల సంఘం సౌక ర్యాలు కల్పించాలి. ఓటువేసే నాటికి 18 సంవత్స రాలు నిండిన ప్రతి ఓటరుకు ఓటువేసే అవకాశం ఇవ్వాలి. అన్ని కళాశాలలో జనవరి 25వ తేదీన జరిపే ఓటర్ల దినోత్సవాన్ని తప్పనిసరిగా నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలి. ఒకవేళ  ఓటరు ఐడెంటిటీ కార్డు పోగొట్టుకున్నా ఎన్నికల సంఘం వెబ్‌సైట్లో కార్డు పొందేలా అవకాశం ఉండాలి. ఎన్నికల సంఘం  వెబ్‌సైట్లో అన్ని గ్రామాల ఓటర్ల జాబితాను పొందు పరచాలి. దీనికి సంబంధించి వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలి. ఓటు అనేది పౌరుడి అస్తిత్వానికి ప్రతీక, దేశ లేదా సమాజ స్థితిగతులను మార్చే శక్తి ఓటుకు ఉన్న ది. ఒక వ్యవస్థకు నాయకుడు ఎంత అవసరమో, ఆ నాయకుణ్ణి ఎన్నుకునేందుకు ఓటు అంతే అవసరం. కానీ చాలామంది ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియ గా, రాజకీయ తంతుగా భావిస్తున్నారు. రాష్ట్రం అభి వృద్ధి చెందాలి, సమాజం పురోగతి సాధించాలి, మ నం బాగుపడాలనే తాపత్రయం ఉండడమే కాదు, ఓటు వేయడం కూడా ముఖ్యమే. అందుకే భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మన వంతు కర్తవ్యాన్ని గుర్తించి ఉన్నతమైన నాయకుణ్ణి ఎన్నుకోవాలి.

రాజ్యాంగం ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం ఓటు హక్కు అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛ కిందికి వస్తుంది. లిండన్ బి జాన్సన్ చెప్పినట్లు ఓటు అన్యాయాన్ని ఎదిరించడానికి మనిషి సృష్టించుకున్న అత్యంత శక్తి మంతమైన సాధనం. ప్రజాస్వామ్య భారతదేశంలో 126 కోట్ల జనాభా ఉండగా 100 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో దాదాపు 50 కోట్ల మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. అంటే దాదాపు 50% మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక్కడ ఒక్క విషయం స్పష్టంగా కనిపించేది ఏమిటంటే- 100 కోట్ల ఓటర్ల భవిష్యత్తును 50% ఓటర్లు మాత్రమే నిర్ణయిస్తారు. ఇది ప్రజాస్వామ్యానికి హానికరం. సమాజంలో ఉన్న వివిధ వ్యవస్థల పాలనకు ప్రజాప్రతినిధులు ఎంత అవసరమో, ఆ ప్రజాప్రతిని ధులను ఎన్నుకునేందుకు ఓటు శక్తిమంతమైన ఆయుధం. కానీ చాలామంది యువకులు ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతుగా భావిస్తు న్నారు ఉదాహరణకు పోలింగ్ రోజును పరిశీలిస్తే ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులు, ప్రైవేటు ఉద్యోగు లు, వివిధ వృత్తుల్లో ఉన్నవారు ఓటువేస్తే సమయం వృథా అనే నిర్లక్ష్య ధోరణిలో ఉన్నారు. అందరూ ఏదో ఒక సందర్భంలో నిత్యం మనకు మంచి నాయకుడు లేడని, అందుకే మన ప్రాంతం అభివృద్ధి కాలేదని,  ఉద్యోగాలు రాలేదని, మంచి విద్య అందడం లేదని, బస్సు సౌకర్యం, రైలు సౌకర్యం లేదని, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, వివిధ రంగా లలో మనం వెనుకబడి ఉన్నామని చాయ్ కొట్టు దగ్గ ర, హోటల్ దగ్గర  నలుగురు కలసిన వివిధ సంద ర్భాలలో మాట్లాడుకోవడం కోకొల్లలు. కాని నలు గురు కలసి మన ప్రాంతానికి ముందుచూపు ఉన్న, సమర్ధవంతవైున, సచ్చీలుడైన నాయకుణ్ణి ఎన్నుకో వాలని అనుకున్న సందర్భాలు అరుదు. మన యువత కనీసం తమ మొబైలు ఫోన్‌కు కేటాయించిన సమయాన్ని కూడా వారి ప్రాంతానికి కావలసిన నాయకుడి ఎన్నికకు కేటాయించక పోవడం చాలా విచారకరం. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా మం చి నాయకత్వం గల నాయకుణ్ణి, సమాజం అభివృద్ధి కావాలని ఆశించడంలో అర్థంలేదు. మన రాష్ట్రం, జి ల్లా, ప్రాంతం, అభివృద్ధి చెందాలి, సమాజం పురోగతి సాధించాలి, అందరం బాగుపడాలి అంటే మంచి నా యకుణ్ణి ఎన్నుకోవాలి. దానికి ఓటు ముఖ్య అయుధం. అందుకే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమవంతు కర్తవ్యాన్ని గుర్తించి ఉన్నతమైన, సామర్ధ్యం, నైతిక విలువలు గల నాయకుణ్ణి  ఎన్ను కోవాలి. యువ ఓటర్లను వంద శాతం ఓటు నమోదు చేసుకునేలా ప్రయత్నం చేయాలి. ఎన్నికల విధులు నిర్వహించే ఉపాధ్యాయులు, ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మల్లా నిలుస్తున్నారు. ఓ టింగ్ శాతం పెరగడానికి, అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకు సెలవుదినంగా ప్రకటించాలి. మన భవిష్యత్తును ఓటు రూపంలో చెల్లిస్తున్నామన్నమాట. ఆ ఓటు మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే నాయకుణ్ణి ఎన్నుకునేందుకు సరైన అస్త్రంగా ఉపయో గపడుతుంది. ఏవో చిన్నచిన్న అవకాశాలకు, నోటు, మద్యం, స్వప్రయోజనాలు, మతం, ఒక ప్రాంతం, కులం కోసమో సంకుచితంగా ఆలోచించకుండా సమాజ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని శాశ్వత ప్రయోజనాల గురించి ఆలోచించి ఓటు వేయాలి.

ఓటు వేయకపోతే మీరు లెక్కలో లేనట్లే. భారత పౌరునిగా మనం నిత్యం ప్రభుత్వం నుంచి అనేక సం క్షేమ పథకాల ఫలాలు పొందుతున్నాం. ఒకవేళ  అవి రాకపోతే హక్కుల ద్వారా పొందుతున్నాం.  ప్రజా స్వామ్య పరిరక్షణ కోసం ఓటు వేయాల్సిన నైతిక బాధ్యత మన అందరిపై ఉన్నది. ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. దీనిని ప్రజాస్వామ్య సంస్కారంగా పేర్కొంటారు. ప్రజాస్వామ్యం వర్థిల్లా లంటే ప్రతిపౌరుడు తన ఓటుహక్కును విని యోగిం చుకొని విశాల దృక్పథం ఉన్న నాయకులను, సమర్థ వంతమైన, ఉన్నత భావాలు గల, ఉన్నత వ్యక్తిత్వం గల  ప్రజా ప్రతినిధులను ఎన్నుకుని సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం సాధించడానికి పౌరులంతా ఓటు హక్కును వినియోగించుకోవాలి.

2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో అత్యధికంగా ఓటు హక్కు  ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ స్థానానికి ఎన్నికలలో ఓటింగ్ 90%పైచిలుకు  జరిగింది. అతి తక్కువగా హైదరాబాదులోని ఎల్‌బీ నగర్ అసెంబ్లీ స్థానానికి 47.4% జరిగింది. ఇంత అక్షరాస్యత ఉన్న ఆధునిక యుగంలో కూడా ఓటు అక్షరాస్యత పెరగకపోవడం మన ప్రజాస్వామ్యానికి చేటు. విద్యావేత్తలు, ప్రభుత్వం కలసి ఓటుపై అవగా హన కార్యక్రమాలు కల్పించాలి. అనేక ప్రజాచైతన్య కార్యక్రమాలకు రూపకల్పన చేయాలి. ఇందులో భాగంగా, కరపత్రాలు,  కళాజాతలు, ర్యాలీలు, పత్రి కా ప్రకటనల ద్వారా వివిధ డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజ నీరింగ్, మెడికల్, ఫార్మసి, ఆర్కిటిక్  వృత్తి నైపుణ్య కళాశాల విద్యార్థులకు ఎలక్టోరల్ క్లబ్స్ ఏర్పాటుచేసి వివిధ వినూత్న కార్యక్రమాల ద్వారా ఓటుపై  అవగాహన కల్పించాలి. ఓట్ల ప్రక్రియ ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉక్కు కవచమని, మహోన్నత యాగమని ప్రజాస్వామ్య పరి ఢవిల్లడానికి ప్రధాన సాధనం ఓటని ప్రజలకు తెలియచేయాలి. రాజ్యాంగం కల్పించిన  ఆర్టికల్ 326 ప్రకారం ఓటు హక్కు పొందటానికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి కుల, మత, ప్రాంత, లింగ, ప్రాంత, జాతి, భాష, ఆర్థిక భేదాలు  లేకుండా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ఓటు అనేది అత్యంత శక్తిమంతమైన అహింసా సాధనం అంటారు జాన్ లేవిస్. మనం వేసే ఓటు ద్వారా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సమాజానికి మంచి జరగాలి. అలాంటి విద్యాధికులకు, సామర్ధ్యం ఉన్నవారికే మంచి నాయ కునికి  ఓటు వేయాలి. అలా కాకుండా సమాజానికి  ప్రమాదం, హాని  తలపెట్టే వారికిగానీ, అభివృద్ధి చేయలేరని భావించేవారికి గానీ ఓటు వేస్తే ఇబ్బంది పడాల్సివస్తుంది.  ఒకవేళ నచ్చని అభ్యర్థులు పోటీలో ఉన్నట్లయితే నోటాకు ఓటు వేసే అవకాశమూ ఉంది. నోటా ద్వారా కనీసం మన అసంతృప్తిని వ్యక్తం చేసేం దుకు అవకాశం ఉన్నది. తాత్కాలిక ప్రయోజనాలకు ఆశపడకుండా దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్టా ఉన్నతు లను ఎన్నుకోవాలి. జాతి ఉన్నతి కోసం, ప్రజాస్వా మ్య  అశయం, పిల్లల జీవితం, ప్రకాశవంతమైన భవి ష్యత్ కోసం ఓటువేయాలి. సమాజాభివృద్ధిలో ప్రభు త్వ నిర్మాణంలో పాలుపంచుకోవాలంటే ఓటు వేయ డం వల్లనే సాధ్యపడుతుంది. రాజ్యాంగబద్ధంగా ఏ ర్పాటయ్యే ప్రభుత్వ వ్యవస్థ ఎలా ఉండాలో నిర్ణయిం చుకునే అధికారం, అవకాశం ఓటుహక్కు ద్వారా ప్రతి వయోజనుడూ ప్రభుత్వాలను, వ్యవస్థలను నిర్మించు కోవచ్చు. అమలు కాని, సాధ్యంకాని, అనువు కాని పనులు చేస్తామని, ఉచిత హామీలు గుప్పించి అర చేతిలో స్వర్గం చూపించే వారికి కాకుండా సాధ్యమ య్యే హామీలు ఇచ్చిన వారికి, నిక్కచ్చిగా, నిజాయితీ గా ఉండేవారికి, కనీస ప్రజావసరాలు తీర్చే  వారికి,   ప్రతినిధికి ఓటువేసి ప్రజాస్వామ్యాన్ని పరిడవిల్లించే ప్రయత్నం చేయాలి. 
 డాక్టర్ రవి కుమార్ చేగొని 
ప్రధాన కార్యదర్శి
తెలంగాణ గ్రంథాలయ సంఘం

Tags

సంబంధిత వార్తలు