విరాట్ బ్యాట్స్‌ మన్‌గా గెలుపు కెప్టెన్‌గా ఓటమి

Updated By ManamThu, 09/13/2018 - 04:12
Virat Kohli

Virat Kohliటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్స్‌మన్‌గా 2014లో కంటే ఈసారి ఇంగ్లాండ్ పర్యటనలో మెరుగైన ప్రతిభ కనబరిచాడు. కానీ కెప్టెన్‌గా ఓటమిపాలయ్యాడు. లార్డ్స్ టెస్టు తర్వాత కోహ్లీ ఒక మాట చెప్పాడు. అదేంటంటే.. ఆ మ్యాచ్‌లో తాము ఇంగ్లాండ్‌ను పూర్తిగా అవుట్ చేయలేకపోయామని అన్నాడు. కోహ్లీ చెప్పిన మాటలు నిజమే. ఎందుకంటే ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను గెలవడంలో ఇంగ్లాండ్ కీలకసమయాల్లో రాణించింది. ఈ సిరీస్‌లో భారత్ మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ తలెత్తకునేలా కోహ్లీ ఆడాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ సీనియర్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌ను సైతం ధీటుగా ఎదుర్కొని 593 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలున్నాయి. తర్వాత రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కేఎల్ రాహుల్ (299) నిలిచాడు. చివరి టెస్టు మ్యాచ్‌లో 149 పరుగులు సాధించాడు. ఈ ఇంగ్లీష్ కండీషన్స్‌కు తాను సిద్ధపడినంతగా సహచరులు సిద్ధపడలేదని కోహీ ఏమాత్రం ఫీల్ కావడం లేదు. ఈ పర్యటనలో టెస్టు సిరీస్‌కు ముందు కౌంటీ చాంపియన్ ఎస్సెక్స్‌తో ఆడేందుకు లభించిన ఏకైక నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లు టీమిండియా మూడ్రోజులకు కుదించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సునీల్ గవాస్కర్ కూడా తీవ్రంగా విమర్శించారు. నాణ్యమైన పిచ్‌లపై, దమ్మున్న ప్రత్యర్థితో ఆడే ప్రాక్టీస్ మ్యాచ్‌లకు విలువుంటుందని తమ నిర్ణయాన్ని కోహ్లీ అప్పుడు సమర్థించుకున్నాడు. ‘ప్రాక్టీస్ మ్యాచ్‌లో కోహ్లీ ఎక్కువగా ఆడటం ఇష్టం లేకపోతే నేరుగా టెస్టు మ్యాచ్‌ల్లో పాల్గొనొచ్చు. కానీ ఇతరులకు ప్రాక్టీస్ చాలా అవసరం. ప్రాక్టీస్ మ్యాచ్‌లకు టెస్టు క్వాలిటీ పిచ్‌లు ఎక్కడా ఉండవు. కానీ బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లు అవసరం. వద్దనుకోవడం కంటే ఏదో ఒకటి ఆడటం మేలే కదా’ అని అప్పట్లో గవాస్కర్ అన్నారు. 

జట్టు ఎంపికలో తప్పులు
ఈ టెస్టు సిరీస్‌లో టీమిండియా చెసిన పెద్ద తప్పు ఏంటంటే.. అర్థం పర్థం లేని తుది జట్టు ఎంపిక. ట్రెంట్ బ్రిడ్జ్ జట్టుకు ఆడి ఆ జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించిన చెటేశ్వర్ పుజారాను తొలి టెస్టుకు పక్కన పెట్టారు. ఈ టెస్టు స్పెషలిస్ట్ ఈ సిరీస్‌లో 278 పరుగులు చేశాడు. రెడ్ బాల్ క్రికెట్‌లోనూ హార్ధిక్ పాండ్య ఆల్ రౌండ్ ప్రతిభ కనబరుస్తాడని అతనిపై కోహ్లీ అతి విశ్వాసం కనబరచడం కూడా ప్రశ్నార్థకమైంది. ట్రెంట్ బ్రిడ్జ్ మ్యాచ్‌లో టీమిండియా డిక్లేర్ చేసే సమయానికి పాండ్య హాఫ్ సెంచరీతో 164 పరుగులు సాధించాడు. ఇన్నింగ్స్‌కు ఐదు వికెట్లు తీశాడు. గత మూడు టెస్టుల్లో కంటే ఈ మ్యాచ్‌లో పాండ్య అసాధారణ ప్రతిభ కనబరిచాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు 6వ నంబర్ స్థానం ఉన్న విలువేంటో కోహ్లీ అంచనా వేయలేకపోయాడు. దీంతో ప్రత్యర్థుల స్వింగ్ బౌలింగ్‌కు భారత బ్యాటింగ్ లైనప్ కుదేలైంది. అదే ప్రత్యర్థి జట్టులో ఉండే యువ బౌలర్ సామ్ కుర్రన్ అర్థం కాని బౌలర్‌గా మారాడు. రెండు మ్యాచ్‌ల్లో మ్యాచ్ విన్నింగ్ ఆల్ రౌండ్ ప్రతిభ కనబరిచాడు. తొలుత ఎడ్గ్‌బాస్టన్‌లో జరిగిన తొలి టెస్టులో, తర్వాత సిరీస్ కైవసం చేసుకున్న నాలుగో టెస్టు (సౌథాంప్టన్). 

ఈసారి బౌలర్లు అదరగొట్టారు
ఇంగ్లాండ్ పర్యటన ఆద్యంతం భారత ఫాస్ట్ బౌలర్లు అదరగొట్టారనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే ఇంగ్లాండ్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేయడంలో కాస్త ఇబ్బంది పడ్డారు. అయితే చివరి వ్యక్తి కూడా బ్యాటింగ్ చేయడం ఇంగ్లాండ్ జట్టు సమర్థ్యాన్ని తెలియజేసింది. ఏదిఏమైనా ఇషాంత్ శర్మ (18), జస్‌ప్రీత్ బుమ్రా (16), మహ్మద్ షమీ (14) ఈ సిరీస్ ఆద్యంతం హూందాగా బౌలింగ్ చేశారు. స్పిన్‌కు సహకరించే సౌథాంప్టన్ టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ ఆకట్టుకోలేకపోయాడు. 

6 విదేశీ టెస్టుల్లో ఓటమి
ఈ ఏడాది టీమిండియా ఆరు విదేశీ టెస్టుల్లో ఓటమిపాలైంది. కానీ ఇదే అత్యుత్తమ విదేశీ పర్యటన జట్టని ప్రధాన కోచ్ రవిశాస్త్రి అంటున్నారు. కోచ్ చెప్పిన దానిపై అడిగే ప్రశ్నలకు కోహ్లీ చిరాకు పుట్టొచ్చు. కానీ నిజాన్ని దాచడం ఎవ్వరి తరమూ కాదు. డిసెంబర్‌లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. మ్యాచ్ ఫలితాన్ని మార్చగల ఉద్దండులు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ లేని ఆస్ట్రేలియా జట్టుతో కోహ్లీ సేన టెస్టు సిరీస్ ఆడనుంది. ఆస్ట్రేలియన్లకు క్రిస్మస్ ఆనందం లేకుండా చేయాలని కోహ్లీ భావిస్తున్నాడు. చూద్దాం.. ఏం జరుగుతుందో. 

అత్యుత్తమ జట్టు ఇదే: కోహ్లీ
మునుపెన్నడూ లేని భారత ఉత్తమ క్రికెట్ జట్టు ఇదే అని కోచ్ రవిశాస్త్రి చెప్పిన తర్వాత కూడా ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా టెస్టు సిరీస్ కోల్పోవడంపై ఆడిన ప్రశ్నలకు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ.. ‘అది మీ అభిప్రాయం కావచ్చు. థాంక్యూ వెరీ మచ్. మేం కూడా అదే నమ్ముతున్నాం. ఎందుకు కాకూడదు. మరి మీరేం అనుకుంటున్నారు’ అని సమాధానమిచ్చాడు. కోచ్ చెప్పిన మాటలు మీపై ఒత్తిడి పెంచాయా అన్న ఓ విలేకరి ప్రశ్నకు కోహ్లీ స్పందిస్తూ.. ‘ఖచ్చితంగా నాకు తెలీదు. అది మీ అభిప్రారం కావచ్చు.. ధాంక్యూ వెరీ మచ్’ అని అన్నాడు. ఐదో టెస్టుకు ముందు శాస్త్రి చేసిన వ్యాఖ్యలు సౌరవ్ గంగూలీతో పాటు గత కెప్టెన్లు సాధించిన ఫలితాలను చిన్నబుచ్చేవిలా ఉన్నాయి. అంతేకాదు టెస్టు సిరీస్ కోల్పోయినందుకు అంతగా బాధపడాల్సిన అవసరం లేదని.. సహచరుల ఆట తీరుతో తాను సంతృప్తిగా ఉన్నానని కోహ్లీ అన్నాడు. నిరుత్సాహకరమైన ఫలితాల తర్వాత అడిగే ప్రశ్నలకు కోహ్లీ ఇలా సూటిగా సమాధానం చెప్పడం ఇది తొలిసారేమీ కాదు. ఈ ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికా పర్యటన సమయంలోనూ కోహ్లీ ఇలాగే స్పందించాడు. కోహ్లీ నాయకత్వంలో 38సార్లు జట్టులో మార్పులు జరిగాయి. 

English Title
Virat is the winner of the winning batsman as captain
Related News