జగన్ పాత్రలో సెన్సేషనల్ హీరో

Updated By ManamFri, 09/14/2018 - 12:24
Jagan Mohan Reddy

Vijay Devarakonda, Jaganదివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. మహి వి రాఘవ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో సూర్య గానీ కార్తి గానీ నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. వైఎస్ కుటుంబంతో సాన్నిహిత్యం కారణంగానే వారిద్దరిలో ఎవరో ఒకరు ఇందులో నటించనున్నారని టాక్ వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రలో టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించనున్నట్లు ఫిలింనగర్‌లో సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్‌లో అతడికి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఈ పాత్ర కోసం విజయ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఈ చిత్రంలో అశ్రిత, సుహాసిని, పోసాని కృష్ణమురళి తదితరులు కీలక పాత్రలలో నటిస్తుండగా.. డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

English Title
Vijay Devarakonda in YS Jagan character
Related News