హిట్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ చిత్రం..?

Updated By ManamWed, 07/18/2018 - 13:25
atlee, vijay

vijay, atleeసినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు ఉన్న డిమాండ్ వేరు. ఆ కాంబినేషన్లో ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా..? అని అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. ఇలాంటి కాంబోలో విజయ్, అట్లీ జోడి ఒకటి. విజయ్‌తో అట్లీ తెరకెక్కించిన తెరి, మెర్సల్ మంచి విజయాన్ని సాధించడంతో ఈ కాంబోలో మరిన్ని చిత్రాలు రావాలని అభిమానులు భావిస్తున్నారు. అయితే వారి ఆశ తీరేలా ఇప్పుడో ఓ వార్త కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో మూవీ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో సర్కార్ చిత్రంలో నటిస్తున్నాడు విజయ్. ఈ చిత్రం తరువాత అట్లీ కాంబినేషన్లో సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. దానికి సంబంధించిన కథకు ఇటీవలే విజయ్ ఓకే చెప్పాడని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే విజయ్ అభిమానుల సంతోషానికి అవధులుండవు.

English Title
Vijay, Atlee team up third time..?
Related News