17 మందిని చంపిన వీడియోగేమ్

Updated By ManamFri, 08/10/2018 - 16:23
grand theft auto

grand theft auto

గ్రాండ్ థెఫ్ట్ ఆటో.. ఇది వీడియో గేమ్ పేరు. ఈ ఆట‌ను బాగా ఇష్ట‌ప‌డే రౌడీ ముఠా ఒక‌టి, అందులో మాదిరిగానే మ‌ర్డ‌ర్లు, దోపిడీలు చేయాల‌ని ప‌థ‌కం వేసింది. ఇందులో భాగంగా రాజ‌ధాని మాస్కో శివారులోని ప్ర‌ధాన ర‌హ‌దారిపై కాపు కాస్తారు. ముందుగా రోడ్డుపై మేకులు దిగ్గొట్టిన ఐర‌న్ ప్లేట్‌ను రోడ్టుపై ప‌డేసి ప‌క్క‌నే మాటు వేసి ఉండేవారు. ఆ ప్లేట్ మీదుగా వెళ్లిన వాహ‌నం టైరు పంక్చ‌ర్ కాగానే ముఠా స‌భ్యులు న‌లుగురు త‌మ తుపాకుల‌తో ఆవాహ‌నంలోని వారిపై విచ్చ‌ల‌విడిగా కాల్పులు జ‌రిపేవారు. అనంత‌రం వారి వ‌ద్ద ఉన్న‌సొత్తును దోచుకుని ప‌రార‌య్యేవారు. ఇలా.. వారు రెండేళ్ల‌లో 17 మంది ప్రాణాలు తీసేశారు.  వారి బారిన ప‌డి మృతి చెందిన‌ వారిలో ఒక పోలీసు అధికారి, సీనియ‌ర్ బ్యాంక‌ర్‌, ప్ర‌ముఖ డ్యాన్స‌ర్ ఉన్నారు. మాస్కోలోని కోర్టు నిందితుల‌కు జీవిత కాల జైలు శిక్ష విధించింది. ఈ ముఠా స‌భ్యులు త‌మ ల‌క్ష్యం కోసం ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ప‌నిచేస్తున్నార‌ని కూడా పోలీసులు తెలిపారు. ఇలాంటి మ‌రో గ్యాంగ్‌ను గ‌త ఏడాది పోలీసులు ప‌ట్టుకున్నారు. అయితే, పోలీసుల‌పై దాడి చేసి ఆయుధాలు గుంజుకుని ప‌రార‌య్యేందుకు ప్ర‌య‌త్నించ‌గా వారిని కాల్చి చంపేశారు.

English Title
Video game that killed 17
Related News