షూటు, లుంగీతో వెంకీ.. లుక్ వైరల్

Updated By ManamFri, 09/14/2018 - 14:00
Venkatesh

Venkateshవెంకటేశ్, వరుణ్‌తేజ్‌లు హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎఫ్ 2’(ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ట్యాగ్‌లైన్). ఇందులో వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్ సరసన మెహ్రీన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ ఫారిన్‌లో జరుగుతోంది. కాగా ఈ చిత్రంలో వెంకటేశ్‌కు సంబంధించిన ఓ లుక్ బయటికి వచ్చింది. అందులో పైన షూటు, కింద లుంగీతో వెంకటేశ్ ఆహార్యం అందరినీ నవ్వించేలా ఉంది. ఇక ఇదే ఫొటోలో ఇద్దరు ఫారిన్ గర్ల్స్ ఉండగా.. వారు కూడా మాస్ అవతారంలో ఆకట్టుకుంటున్నారు. ఇక కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

English Title
Venkatesh look from F2
Related News