‘చినబాబు‘పై ఉపరాష్ట్రపతి ప్రశంసలు

Updated By ManamTue, 07/17/2018 - 10:22
chinbababu

chinababu కార్తీ, సాయేషా సైగల్, సత్య రాజ్ తదితరులు ప్రధానపాత్రలలో జాతీయ అవార్డు గ్రహీత పాండిరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘కడైకుట్టి సింగం’(తెలుగులో ‘చినబాబు’). రైతు కష్టాలు, ఉమ్మడి కుటుంబంలోని అనుబంధాలు, అలకలు, కోపాలు కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ రెండు చోట్ల పాజిటివ్ టాక్‌ను తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కురిపిస్తోంది. 

కాగా తాజాగా ఈ చిత్రాన్ని చూసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు. వ్యవసాయ ప్రాధాన్యత, కుటుంబ జీవనం, పశుసంపద పట్ల ప్రేమ, ఆడపిల్లల పట్ల నెలకొన్న వివక్ష నేపథ్యంలో చినబాబు చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ప్రజాదరణ పొందే విధంగా తెరకెక్కించిన దర్శకుడు పాండిరాజ్, నిర్మాత సూర్య, నటుడు కార్తికి అభినందనలు అంటూ ట్విట్టర్ వేదికగా అభినందించారు.

English Title
Venkaiah Naidu praises on Chinababu
Related News