సెక్స్ రాకెట్ కేసులో అడ్డంగా బుక్కయిన సినీనటి

Updated By ManamSun, 06/03/2018 - 19:44
Vani rani, actress sangeetha balan, prostitution case

Vani rani, actress sangeetha balan, prostitution caseచెన్నై: సెక్స్‌ రాకెట్‌ కేసులో ఓ సీనియర్‌ నటి బుక్కయింది. చెన్నైలోని పనయూర్‌ ప్రాంతంలోని ఓ ప్రైవేటు రిసార్ట్స్‌లో సినీనటి సంగీత బాలన్‌ అరెస్ట్‌ అయ్యారు. ప్రైవేటు రిసార్ట్స్‌లో ఆమె వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది. సమచారం అందుకున్న పోలీసులు సంగీత బాలన్ రిసార్ట్‌పై దాడి చేశారు. ఈ దాడిలో కొంతమంది విటులు సహా పలువురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నటి సంగీతతో పాటు సురేశ్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చారు. కోర్టు సంగీత సహా ఇద్దరికి కస్టడీ విధించింది. ఈ సెక్స్‌ రాకెట్‌ వ్యవహారంలో సంగీత బాలన్‌తో పాటు మరికొందరి సినీప్రముఖుల హస్తం ఉన్నట్లు సమాచారం. 1996లో కరుప్పు రోజా తమిళ చిత్రంతో సినీ కెరీర్‌ ప్రారంభించిన సంగీత బాలన్‌ అనంతరం పలుచిత్రాల్లో సపోర్టింగ్‌ పాత్రల్లో నటించారు. రాధిక శరత్‌ కుమార్‌ ‘వాణి రాణి’ సీరియల్‌లో సంగీత బాలన్‌ అత్త పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు యువతులను రెస్క్యూహోంకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

English Title
Vani rani actress sangeetha balan arrested prostitution case
Related News