రెడ్డి సామాజికవర్గానికేనా సీఎం పదవి?

V Hanumantha Rao Comments On CM condidate in Mahakutami

హైదరాబాద్ : ఆలూ లేదు చూలు లేదు...కొడుకు పేరు సోమలింగం అన్నట్లు...ఇంకా ఎన్నికలు జరగలేదు... ఫలితాలు వెలువడకముందే కాంగ్రెస్ పార్టీలో అప్పుడే... ముఖ్యమంత్రి అభ్యర్థిపై లొల్లి మొదలైంది. సీఎం అభ్యర్థి తానంటే తానని... ఎవరికి వారు సీఎం పీఠంపై కర్చీఫ్ కూడా వేసేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు ...ముఖ్యమంత్రి అభ్యర్థిపై వ్యాఖ్యలు చేశారు.

ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ...‘ ముఖ్యమంత్రి పదవి ఎప్పుడూ రెడ్డి సామాజికవర్గానికేనా?. మహాకూటమి అధికారంలోకి వస్తే  బీసీలకు ఈసారి అవకాశం కల్పించాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పడానికి గులాం నబీ ఆజాద్ ఎవరు?. మరోవైపు సర్వే సత్యనారాయణ కూడా తనను తాను సీఎం పదవి రేసులో ఉన్నానని చెప్పుకుంటున్నారు. గతంలో నాకు సీఎం పదవి నోటీ వరకూ వచ్చి పోయింది.’ అని అన్నారు.

సంబంధిత వార్తలు