367 పరుగులకు టీమిండియా ఆలౌట్

Updated By ManamSun, 10/14/2018 - 12:38
 Umesh Yadav Strikes As Brathwaite Falls For A Duck
  • వెస్టిండీస్‌పై 56 పరుగుల ఆధిక్యం

India vs West Indies: WI restrict India to 367, trail by 56 runs

హైదరాబాద్ : ఉప్పల్ టెస్ట్‌లో టీమిండియా 367 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 56 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో 308/4 పరుగులు ఓవర్ నైట్ స్కోర్‌తో ఆదివారం ఉదయం బరిలోకి దిగిన టీమిండియా మరో 59 పరుగులు మాత్రమే చేసి, ఆలౌటైంది.

భారీ స్కోర్ చేసేందుకు టీమిండియా ఆటగాళ్లు ప్రయత్నించినప్పటికీ విండీస్ బౌలర్లు కట్టడి చేయడంతో స్వల్ప ఆధిక్యం మాత్రమే సాధించగలిగారు. మరోవైపు రిషబ్ పంత్ కూడా తృటిలో సెంచరీ అవకాశాన్ని మిస్ అయ్యాడు. 92 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గాబ్రియేల్ బౌలింగ్‌లో పెవిలియన్ దారి పట్టాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగటంతో టీమిండియా 350 పరుగులు చేసింది. ఇక విండీస్ బౌలర్లు హౌల్టర్ అయిదు, గాబ్రియెల్ మూడు, వారికన్ రెండు వికెట్లు తీశారు.

English Title
Uppal Test:West Indies restrict India to 367, trail by 56 runs
Related News