దేశాన్ని నడిపించిన అపూర్వ శక్తి 

Updated By ManamMon, 10/15/2018 - 04:47
Abdul Kalam

Abdul Kalamఅబ్దుల్ కలాం అక్టోబర్ 15, 1931న రామే శ్వరంలో జన్మించారు. తల్లి ఆషియమ్మ గృహిణి, తండ్రి జైనులబ్దీన్ పడవ యజమాని. కలాం అసలు పేరు అవుల్ ఫకీర్ జైనలబ్దీన్ అబ్దుల్ కలాం(ఎపిజె అబ్దుల్ కలాం).
‘విజయం సాధించడమంటే మీ సంతకం ఆటోగ్రాఫ్‌గా మారటమే’ అన్న కలాం భారతీ యతకు, సంస్కృతి, సంప్రదాయలకు, ఆధునిక విజ్ఞానానికి, సాంకేతిక విప్లవానికి, అంతరిక్ష, అణురంగానికి పర్యాయపదం. రామనాధ పురంలో స్క్వార్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో పాఠ శాల విద్యను కలాం పూర్తి చేశాడు. తిరుచిరా పల్లి సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశాడు. ఐఐటి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. బాల్యంలో తన తల్లి ప్రభావంతో ఇంటి పరిస్థితులను అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా ఇంటింటికి దిన పత్రికలను పంచేవాడు. ఆ డబ్బు లను అమ్మకు ఇచ్చేవాడు. కష్టాలకు ఎదురీది తన చదువును కొనసాగించాడు కలాం. ‘మనిషికి కష్టాలెందుకు కావాలంటే.. అవే అతనికి విజయాన్ని ఆనందించే మనఃస్థితిని స్తాయి.’ అవే కలాం సానుకూల దృక్పథం తరత రాలకు అనుకరణీయం, ఆచరణీయం. ‘యుద్ధ పైలట్’ కావాలనే కలను తృటిలో జారిపోవడం కలాంకు బాధ కలిగించినా, అది దేశానికి ఒక రత్నాన్ని బహుమతిగా ఇచ్చింది. ఆ తరువాత కలాం జీవితం ప్రపంచాన్ని ప్రభావితం చేసే చరిత్రగా మారింది. 

జయప్రదమైన జీవితాన్ని జీవించడానికి అవసరమైనదంతా మనిషి మనసులోనే ఉంది. 1960లో డిఆర్‌డిఓ (డిఫెన్స్ రీచెర్చ్ అండ్ డెవ లప్మెంట్ ఆర్గనైజేషన్)లో ఎయిరో నాటికల్ డెవ లప్‌మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఎడిఎ) శాస్త్రవేత్తగా చేరాడు. భారతసైన్యం కోసం ఒక చిన్న హెలి కాప్టర్ తయారు చేయటం ద్వారా తన ‘దేశ సేవ’ ప్రారంభించాడు. 1969లో ఇస్రోలో చేరిన కలాం భారత అంతరిక్ష రంగంలో నూతన సం చలనాలకు కేంద్ర బిందువయ్యాడు. ఎస్‌ఎల్‌వి3 ప్రయోగానికి డైరెక్డర్‌గా ప్రస్థానం ప్రారంభించి రోహిణి, సోలార్ ఎస్‌ఎల్‌వి, ఎస్‌ఎల్‌వి4 ఉప గ్రహాలను విజయవంతంగా ప్రయోగించడంలో కీలక భూమిక వహించారు. 1970-1990ల మధ్యకాలంలో భారతదేశ అంతరిక్ష రంగ ప్రయోగాలు ప్రపంచాన్ని విస్మయానికి గురి చేశాయంటే దానికి ప్రధాన కారణం ఎపిజె అబ్దుల్ కలాం. 1992 నుంచి 1999 వరకు ప్రధానమంత్రి ముఖ్య శాస్త్రీయ సలహాదారు నిగా పనిచేశారు. వాజ్‌పేయి ప్రధానమంత్రిగా పనిచేసిన కాలంలో పోఖ్రాన్ 2 అణుపరీక్షలను అత్యంత రహస్యంగా నిర్వహించి భారతదేశ శక్తిని ప్రపంచానికి తెలియజేశాడు. కలాం శాకాహారి, మద్యపానం వ్యతిరేకి. బ్రహ్మచారి. కుటుంబం అనేది ఆ వృత్తికి కారణం కాకూడనేవారు కలాం. కలాం ఖురాన్ తో పాటు భగవద్గీతను కూడా పఠించేవారు. తన ప్రసంగంలో తిరుక్కురాల్‌లోని ఏదో ఒక పాశురాన్ని ఖచ్చితంగా ఉటంకించేవారు. ఇది ఆయన ‘విశ్వమానవుడి’గా తెలియజేస్తుంది. ‘జీవితం నీకు విజయాలనందించదు. కేవ లం అవకాశాలను ఇస్తుంది. ఆ అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి నీ చేతుల్లో ఉం టుంది.’ తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని దేశ అభివృద్ధిలో మైలురాళ్ళుగా మలచిన అపురూప శిల్పి కలాం. 1981లో పద్మభూషణ్, 1990లో పద్మ విభూషణ్, 1997లో భారతరత్న పురష్కా రాలను అందించి దేశం తనను తాను గౌరవిం చుకుంది. ఏ రాజకీయ వాసనలు లేని ‘కలాం’ను అన్ని రాజకీయ పార్టీలు కలసి ‘రాష్ట్రపతి’గా ఎన్నుకోవటం దేశ గమనంలో కలాం స్థానం ఎంత బలీయమనదో తెలుపుతుంది. తాను ఏ వృత్తిలో పనిచేసినప్పటికీ ‘అధ్యాపకునిగా’ తర గతి గదిలో విద్యార్థుల మధ్య గడిపిన ‘క్షణాలు’ అమూల్యమైనవని చెప్పేవారు. శాస్త్రవేత్తగా కలాం హృద్రోగుల కోసం ‘కలాం’ స్టెంట్, విక లాంగుల కోసం, పోలియో వ్యాధిగ్రస్తుల కోసం ‘ఆర్థోసిస్ కాలిపర్స్’ని కనుక్కోవటం ద్వారా తన జీవితాన్ని సార్థకం చేసుకోగలిగాడు. 

ఒక విజేత ఆత్మకథ, నా జీవన గమనం, నా దేశ యువజనులారా, ఈ మొగ్గలు వికసి స్తాయి, భారతదేశ శక్తి, ఎవరికీ తలవంచదు, ఇండియా 2020 మొదలగు పుస్తకాలను రచించి తన జీవిత సారాన్నంత ప్రపంచానికి పంచారు. తాను అభివృద్ధి చేసిన అణ్వాయుధ కార్యక్ర మాన్ని ప్రపంచంలో బలీయమైన శక్తి అయిన భారతదేశం గురించి దేశమంతటా పర్యటించి యువతకు, బాలలకు వివరించారు కలాం. 2015 జూలై 27న షిల్లాంగ్‌లో తనకెంతో ఇష్టమైన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూనే గుండెపోటుతో చివరిశ్వాస విడవడం యాదృ చ్చికం. కర్మయోగి, నిష్కళంక ఋషి, దేశమాత కు ప్రియమైన పుత్రుడు అబ్దుల్‌కలాం మరణా న్ని ప్రపంచంలోని ప్రతి వ్యక్తి తన ఆత్మీయుడిని కోల్పోయినట్లుగా భావించి కన్నీటితో నివాళులు అర్పించటం మహాద్భుత దృశ్యం. ప్రపంచాన్ని అన్ని రంగాలలో శాసించే ప్రచండశక్తిగా భారత దేశాన్ని చూడాలనుకున్న కలాం ఆశయాన్ని నెరవేర్చటమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి.
 అట్లూరి వెంకటరమణ
9177237945
(నేడు కలాం జయంతి)

English Title
Unprecedented power that led the nation
Related News