స్టేజీపైనే సొమ్మసిల్లిన గడ్కరీ!

Union minister, Nitin Gadkari, faints on stage, Maharashtra
  • మహారాష్ట్రలో వేదికపై కూలబడ్డ కేంద్ర మంత్రి

  • లో బీపీ షుగర్ కారణమన్న వైద్యులు.. ఆస్పత్రికి తరలింపు

  • అహ్మద్‌నగర్ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఘటన.. 

  • తేరుకున్న గడ్కరీ.. ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు 

ముంబై: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వేదికపై సొమ్మసిల్లారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో ఓ వేదికపై నిలబడిన గడ్కరీ.. అక్కడినే మూర్ఛపోయారు. గడ్కరీ పక్కనే స్టేజీపై నిల్చున్న మహారాష్ట్ర గవర్నర్ సి. విద్యాసాగర్ రావు వెంటనే ఆయన్ను పడిపోకుండా పట్టుకున్నారు. అహ్మద్‌నగర్‌లో మహత్మా ఫూలే అగ్రికల్చరల్ యూనివర్శిటీలో శుక్రవారం స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన అనంతరం గడ్కరీ తన సీటులో కూర్చొన్నారు. కొన్ని నిమిషాల తరువాత జాతీయ గీతం ఆలాపన సమయంలో లేచి నిలబడ్డారు. 

అంతలో గడ్కరీ ఒక్కసారిగా సొమ్మసిల్లారు. పక్కనే నిల్చొన్న గవర్నర్ విద్యాసాగర్ రావు గడ్కరీని కిందపడిపోకుండా పట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టారు. పది నిమిషాల తరువాత తేరుకున్న ఆయనకు స్వీటు తినిపించి.. నీళ్లు తాగించారు. గడ్కరీని సమీప ఆస్పత్రికి తరలించగా.. కోలుకున్న ఆయన్ను డిశ్చార్జీ చేశారు. అనంతరం నితిన్ గడ్కరీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘‘నా ఆరోగ్యం బాగానే ఉంది. లో బ్లడ్ షుగర్ కారణంగా ఒక్కసారిగా స్పృహా కోల్పోయాను. వైద్యుల సాయంతో తిరిగి కోలుకున్నాను. అందరికి ధన్యవాదాలు’’ అని ట్వీట్ చేశారు.   

Had slight medical condition due to low sugar. I have been attended by doctors and i am doing well now. I thank all of you for all the well wishes.

— Nitin Gadkari (@nitin_gadkari) December 7, 2018

సంబంధిత వార్తలు