రెండు వికెట్లు కోల్పోయిన కోహ్లీసేన

Updated By ManamThu, 05/17/2018 - 20:25
Sunrisers Hyderabad, toss and elected to field, Royal Challengers Bangalore, IPL 2018

Sunrisers Hyderabad, toss and elected to field, Royal Challengers Bangalore, IPL 2018బెంగళూరు: ఐపీఎల్-11 సీజన్‌లో భాగంగా గురువారం ఇక్కడ బెంగళూరు వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ బ్యాట్స్‌మన్ పార్థీవ్ పటేల్ (1) సందీప్ శర్మ బౌలింగ్‌లో సిద్ధార్థ్ కౌల్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. విరాట్ కోహ్లీ కూడా (12) పరుగులకే రషీద్ ఖాన్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. పార్థీవ్ స్థానంలో డివిలియర్స్ (25), మోయిన్ అలీ (1) క్రీజులో కొనసాగుతున్నారు. ప్రస్తుతం బెంగళూరు 5 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 39 పరుగులు సాధించింది. సన్‌రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ ఒక వికెట్ తీసుకున్నాడు.

అంతకుముందు తొలుత టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బెంగళూరు జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. సన్‌‌రైజర్స్‌లో ఒక మార్పు చోటుచేసుకోగా, భువనేశ్వర్ కుమార్ స్థానంలో బసిల్ థంపీకి తుదిజట్టులో చోటు దక్కింది. బెంగళూరు జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. బెంగళూరు ఓపెనర్లుగా పార్థీవ్ పటేల్, కెప్టెన్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగగా, సన్‌రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ తొలి ఓవర్ అందుకున్నాడు.

English Title
Two wickets lost by Royal Challengers Bangalore
Related News