అమృత తండ్రిపై మరో రెండు కేసులు

Updated By ManamTue, 10/16/2018 - 12:00
Maruthi Rao

Maruthi Raoనల్గొండ: మిర్యాలగూడ ప్రణయ్ పరువుహత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావుపై మరో రెండు కేసులు నమోదు అయ్యాయి. హత్యకు ముందు ప్రణయ్ బంధువులైన కోడిరెక్క అశోక్‌, ఎర్రమళ్ల దినేష్‌లకు విడివిడిగా తమ కార్యాలయానికి పిలిపించుకున్న మారుతీరావు.. ప్రణయ్, అమృతల వివరాలను తెలపాలని వారిని బెదిరించగా.. వాటికి సంబంధించి ఆ ఇద్దరు మారుతీరావుపై కేసులను నమోదు చేశారు.

అతడితో పాటు ప్రణయ్ కేసులో నిందితులైన శ్రవణ్, కరీంల పేర్లను కూడా ఫిర్యాదులో పొందపరిచారు. మారుతీరావుతో పాటు వారు కూడా తమను బెదిరించినట్లు అశోక్, దినేష్ చెప్పారు. ఇక ఈ కేసు నిమిత్తం పోలీసులు వారిని తాజాగా కోర్టులో ప్రవేశపెట్టగా.. నిందితులకు ఈ నెల 29వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.

English Title
Two more cases against Maruthi Rao
Related News