జంట రుణాలకు ఒకే నిబంధనలు

Asian Development Bank
  • ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్‌ల మధ్య అంగీకారం

న్యూఢిల్లీ: తాము జంటగా రుణాలిస్తున్న ప్రాజెక్టులు మరింత సమర్థంగా పనిచేసే విధంగా ఒకే నిబంధనల చట్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రపంచ బ్యాంకుతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్  (ఏ.డి.బి) గురువారం పేర్కొంది. ప్రపంచ బ్యాంకుతో ఏ.డి.బి కుదుర్చుకున్న మొదటి ప్రత్యామ్నాయ కొనుగోలు ఏర్పాటు (ఏ.పి.ఏ) తాము జంటగా రుణాలిచ్చిన ప్రాజెక్టులు ఒకే కొనుగోలు వ్యవస్థను అనుసరించడానికి వీలు కల్పిస్తుందని ఏ.డి.బి ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘మొత్తం ప్రాజెక్టునకు ఒకే నిబంధనల చట్రాన్ని వర్తింపజేయడం వల్ల సహ-రుణ ప్రాజెక్టులను మరింత సమర్థంగా అమలుజరపడానికి నూతన ఏర్పాటు వీలు కల్పిస్తుంది. ఏ.డి.బి క్లయింట్లకు లావాదేవీల వ్యయాలను అది తగ్గిస్తుంది’’ అని ఏ.డి.బికి చెందిన కొనుగోలు, పోర్ట్‌ఫోలియో, ఫినాన్షియల్ మేనేజ్‌మెంట్ విభాగ డైరెక్టర్ జనరల్ రీసా ఝిజియా తెంగ్ అన్నారు. ‘వ్యూహం 2030’కి అనుగుణంగా కొనుగోళ్ళకు పట్టే సమయాలను తగ్గించేందుకు ఏ.పి.ఏతో మరో అడుగు వేసినట్లయిందని ఆమె అన్నారు. ఏషియా, పసిఫిక్ ప్రాంత మారుతున్న అవసరాలపై ప్రభావశీలతతో స్పందించేందుకు ఏ.డి.బి రూపొందించుకున్న దీర్ఘకాలిక ప్రణాళికే ‘వ్యూహం 2030’. ఇదే రకమైన ఏర్పాట్లను ఉపయోగించుకునే సహ-రుణ ప్రాజెక్టుల సంఖ్యను విస్తరింపజేసేందుకు ఇతర బహుళ దేశీయ ఏజన్సీలతో కూడా చర్చ లు జరుపుతున్నట్లు ఏ.డి.బి తెలిపింది. దీనివల్ల ప్రాజెక్టులను అమలుజరిపే ఏజన్సీలపై భారం తగ్గుతుంది. అవి ఇన్నాళ్ళూ సం ప్రదాయంగా ఒకే ప్రాజెక్టుపైన బహుళ కొనుగోలు నిబంధనల వ్యవస్థలను ఉపయోగిస్తున్నాయి. ప్రాజెక్టుల అమలుకు రకరకాల పద్ధతులను అవలంబిస్తున్నాయని ఏ.డి.బి పేర్కొంది. ఏ.డి.బి 2017లో మొత్తం 32.2 బిలియన్ డాలర్ల  కార్యకలాపాలు చేపడితే, అందులో 11.9 బిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్టులు ఇత ర సంస్థలు ఇచ్చిన రుణాలతో కూడా ముడిపడి ఉన్నాయి.
 

సంబంధిత వార్తలు