రమణ దీక్షితులు, విజయసాయి రెడ్డిలకు టీటీడీ నోటీసులు

Updated By ManamWed, 06/13/2018 - 12:56
Vijaya sai reddy
Vijaya Sai Reddy

తిరుమల: శ్రీవారి మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు, వైసీపీ నేత విజయసాయిరెడ్డిలకు తిరుమల తిరుపతి దేవస్థాన సంస్థ(టీటీడీ) నోటీసులు జారీ చేసింది. పరువుకు భంగం కలిగేలా వారు చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో కోరింది. వివరణ ఇవ్వకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నోటీసులలో తెలిపింది.

కాగా గత కొన్ని రోజులుగా టీటీడీపై రమణ దీక్షితులు ఆరోపణలు చేస్తున్నారు. టీటీడీలో రాజకీయాలు ఎక్కువ అయ్యాయని, స్వామి వారి నగలను అమ్మేశారని ఆయన ఆరోపణలు చేశారు. మరోవైపు టీటీడీకి చెందిన కొన్ని ఆభరణాలు సీఎం చంద్రబాబు నివాసంలో ఉన్నాయని విజయసాయి రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

English Title
TTD notices to Ramana Deekshitulu, Vijaya Sai Reddy
Related News