రమణ దీక్షితులు అవుట్.. 65 ఏళ్లు దాటితే రిటైర్మెంట్

Updated By ManamWed, 05/16/2018 - 16:22
TTD Chairman Putta Sudhakar Yadav Counters Ramana Deekshitulu?
  • టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం.. రమణ దీక్షితులు వ్యాఖ్యలకు కౌంటరేనా? 

TTD Chairman Putta Sudhakar Yadav Counters Ramana Deekshitulu?తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి.. అర్చకుల విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు నిండిన అర్చకులకు పదవీ విరమణ కల్పించాలని నిర్ణయించింది. 65 ఏళ్లు దాటిన అర్చకులందరికీ రిటైర్మెంట్ ఇస్తామని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటించారు. ఆయన నేతృత్వంలోని పాలకమండలి మొత్తం ఆ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఆమోదం తెలిపిన కొద్ది సేపటికే ఆ నిర్ణయం అమల్లోకి వచ్చింది.

ప్రధానార్చకుడు రమణ దీక్షితులను పదవి నుంచి టీటీడీ పాలకమండలి తప్పించింది. ఇక, నిర్ణయాన్ని అమలు చేయడంతో రమణ దీక్షితులను తొలగింపుతో పాటు నరశింహ దీక్షితులు, శ్రీనివాస దీక్షితులు, నారాయణ దీక్షితులు పదవులు కోల్పోయారు. స్వామి వారి సేవల విషయంలో రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే టీటీడీ పాలకమండలి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. లేదంటే ఇంత హఠాత్తుగా సమావేశం ఏర్పాటు చేసి రిటైర్మెంట్ గురించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. తిరుమలలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించినందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేమోనని అనుమానిస్తున్నారు. కాగా, రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరతామని టీటీడీ ఈవో సింఘాల్ తెలిపారు. 

English Title
TTD Chairman Putta Sudhakar Yadav Counters Ramana Deekshitulu?
Related News