ఎల్లుండి తెలంగాణ ఎంసెట్ ఫలితాలు

Updated By ManamThu, 05/17/2018 - 19:13
TS Eamcet-2018, TS Eamcet results, JNTUH board, Telugu states students

TS Eamcet-2018, TS Eamcet results, JNTUH board, Telugu states studentsహైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌-2018 ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. ఈ నెల 19న ఎంసెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్టు జేఎన్‌టీయూహెచ్‌ బోర్డు అధికారులు వెల్లడించారు. ఎల్లుండి ఇంజినీరింగ్ ర్యాంకులను ప్రకటించనుంది. ఎంసెట్ ఫలితాలకు సంబంధించిన రెస్పాన్స్ షీట్‌ను ఇప్పటికే పరీక్షకు హాజరైన విద్యార్థులకు మెయిల్ ద్వారా పంపినట్టు అధికారులు పేర్కొన్నారు. 

తెలంగాణ ఎంసెట్‌-2018 పరీక్షలు జేఎన్‌టీయూ-హెచ్‌ ఆధ్వర్యంలో మే 2 నుంచి 7వరకు జరిగిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 87 కేంద్రాల్లో కంప్యూటర్‌ ఆధారితంగా ఈ పరీక్షలను నిర్వహించారు. తెలంగాణ నుంచి 1,19,270 మంది విద్యార్థులు హాజరుకాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి 17,041 మంది విద్యార్థులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి ఈ పరీక్షలకు 1,36,311 మంది విద్యార్థులు హాజరయ్యారు. 

English Title
TS Eamcet-2018 results to be released on May 19
Related News