నిజమైన మానవతావాదం

Updated By ManamWed, 10/03/2018 - 02:34
mathanam

imageగాంధీ అనగానే స్వాతం త్య్ర సమరయోధుడని, ‘జాతిపిత, మహాత్ముడు’ అని అంటారని మాత్ర మే నేటి యువత భావిస్తుంది. కానీ, ఆ లక్ష్య సాధనలో ఆయన అనుసరించిన వి ధానాలు, నమ్ముకున్న సి ద్ధాంతాలు ఉత్కృష్ఠమైనవి. 20వ శతాబ్దిలోని రాజకీయ నాయకులలో అత్యధికంగా మానవాళిని ప్రభావితం చేసిన రాజకీయ నాయ కునిగా ఆయనను కేబుల్ న్యూస్ నెట్వర్క్ (సీఎన్‌ఎన్) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారంటే ఆయనెంత గొప్ప నాయకుడో తెలుస్తుంది. అనేక మతాల పవిత్ర గ్రంథాలను చదివాడు. ఈ కా లంలోనే ఆయన చదువూ, వ్యక్తిత్వమూ, ఆలోచనా సరళీ మానసిక వికాసాన్ని అందిం చడంలో ఆయనకు దోహదపడ్డాయి.

నాయకుడనేవాడు మొదట తను నీతి తప్ప కుండా ధర్మబద్ధంగా వుంటూ, సత్య ప్రచారం కావించిన ప్పుడే జాతిమెచ్చిన వాడవుతాడని ఆయన నిరూపించాడు. అందుకే ఒకచెంప మీద కొడితే రెండవ చెంప చూపించమని తెలపడం. కానీ, ఈనాటి పరిస్థితులు అందుకు అనుకూలం గా ఏమాత్రం లేదు. అకారణంగానే దౌర్జన్యానికి పాల్పడటం దినపత్రికలలో నిత్యం కనిపిస్తుంది.

1869 గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో సామా న్య సంప్రదాయ కుటుంబంలో పుట్టినా, న్యాయ శాస్త్రంలో పట్టభద్రుడైimage న్యాయం కోసం పోరాటం చేశాడు. ఆ సమయంలోనే అధికారానికి, అన్యా యానికి లొంగకుండా జాతివివక్షపై వెనుకకు తగ్గకుండా ఎదురించి నిలిచాడు. ప్రజలందరిలో వివేకాన్ని మేల్కొలిపాడు. దేశ ప్రజలందరికోసం, తెల్లవారి పెత్తనం నుంచి బయట పడటం కోసం తన జీవితకాలంలో ఎన్నోసార్లు జైలుకు వెళ్ళా డు. అయితే, నేటి నాయకులలో చాలా వరకు నాయకత్వమంటే జనం తన మాటను శిరసా వహించి ఎదిరించకుండా నడచుకోవటంగా భా విస్తున్నారు. ఎదురిస్తే పదవుల్ని అడ్డం పెట్టుకుని బెదిరిస్తున్నారు. జనం కోసం త్యాగాలు చేసే మా ట అటుంచి, తామే జనం నుంచి కావలసింది బలవంతంగా లాక్కోవటంలో పేరు గాంచుతు న్నారు.
నిరాడంబర జీవితంతో, ఆడంబరాన్ని ప్రదర్శించకుండా జీవించాడు గాంధీ. కానీ, నేడు తామే కాకుండా తమ పరివారం డాబు దర్పాల కోసం పాకులాడటం కనిపిస్తుంది. ఎందరు దుయ్యబట్టినా చిత్తశుద్ధి లేకుండా తుడుచుకు పోవటం, పదవులకోసం పాకులాడే చాలా మం దికి తెలిసిన రాజకీయమైంది.

దానికి తోడు నాటి ప్రజలు, చాలామంది నాయకులు కూడా పాపభీతి, భూతదయ కలిగి నడుచుకునేవాళ్ళు. నేడు సామాజిక మాధ్యమాల ప్రభావం, విపరీతమైన పబ్, నెట్‌లకు అలవాటై మరియు పెద్దల హద్దులు లేని ధన అహంకారం తో మితిమీరిన స్వేచ్చ, భక్తి గౌరవం లోపించిన సమాజపు పోకడలు కనిపిస్తున్నాయి.
నాటి రాజకీయ ఎత్తుగడలు సమాజానికి ఉపయోగపడే ఆలోచనలతో సాగేవి. కాని, నేడు ఏ విధంగా దొడ్డిదారినైనా ధనబలంతో ఓట్లు పోగేసుకుని అందలమెక్కాలాన్న ధోరణితో వుంది. గాంధీజీ జనులను కూడగట్టి తన జన్మ భూమి దాస్య శృంఖలాలు తొలగించే సమయం లో ఎన్నో కష్టనష్టాలను ఓర్చారు. కుటుంబాన్ని, బంధుజనాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం దానికి పూర్తి విరుద్ధ పరిస్థితులు కనిపి స్తాయి. ఒకరు పదవి చేజిక్కించుకుంటే బంధు గణం మేలు పొందటం కనిపిస్తుంది. ఆ ప్రయ త్నంలో కిడ్నాపులు, హత్యలు, అత్యాచారాలు, పగలు, ప్రతీకారాలు కోకొల్లలై, నిందితులు అధికారం, అర్ధబలంతో తప్పించుకు తిరగటం జగమెరిగిన సత్యమైపోయింది.
గాంధేయవాదమంటే అహింస సత్యాగ్రహా లనే సిద్ధాంతాలు. అయితే మూర్ఖంగా ఎంత దేశభక్తి పరాయణుడైనా అనాలోచితంగా నడచు కున్న ‘గాడ్సే వాదం’లా ఆవేశంతో ఆలోచనా హీనమైన సమాజ పోకడలుండటం కనిపిస్తుంది. ‘వాగ్దాన’మంటే వున్న గౌరవం నేడు పూర్తిగా అడుగంటి పోయి, అవి ఎన్నికలవేళ వల్లించే దయ్యపు వేదాలుగా అనుకోవటం పరిపాటైంది. అందువల్ల ప్రజల మనసుల్లో నాయకుని పట్ల నమ్మకం సన్నగిల్లటమే కాక గౌరవ భావం తగ్గిపోవటం, భయాందోళనలతో, భరోసాలేని జీవనవిధానంగా పరిణమించింది.
అంతేకాకుండా, సాంకేతిక పరిణామాల దృష్ట్యా కూడా జనం ధనార్జన, మితిమీరిన అంతర్జాల బలహీనులై ఎదుటివారి గురించి ఆలోచించకపోవటం స్వార్ధపూరిత ఆలోచనాపరు లై సమయ పాలన, బాధ్యత లేకుండా కనీసం పక్కవాడ్ని సైతం పట్టించుకోకుండా వుండటం శోచనీయైం.

‘మహానుభావులు ఎప్పుడో ఎక్కడో పుడ తారు’ అనికాకుండా, భావి భారత పౌరుల్ని గురువులు నిబద్ధతతో తీర్చిదిద్దాలి, తల్లి దండ్రులు తమ సౌకర్యానుసారం కాకుండా పిల్లల మంచి భవితకై సమయం కేటాయించి నేర్పగలగాలి, ప్రజా ప్రతినిధుల్ని ఎన్నుకునే సమయంలో వారి విద్య, నడవడిని గమనించి ప్రజలు ఎన్నుకోవాలి.
ఏనాడైతే పూర్తి నిజాయితీపరులు, ధర్మ బద్ధులు, ప్రజల అవసరాలకోసం, జాతి పురో గతి కోసం అహర్నిశలు శ్రమించేవాళ్ళు నాయకులవుతారో ఆనాడే ఏ దేశమైనా గొప్పదనాన్ని, ఖ్యాతిని పొంది ప్రజల మనసుల్లో సుస్థిరంగా నిలుస్తుంది. అలాగే తోటివారి ఉన్నతిని సహించి, మతసహనంతో, మానవత్వంతో మని షిని మనిషి ప్రేమగా ఏనాడు చూడగలడో ఆనాడే మళ్ళీ గాంధేయవాదం పుడుతుంది. సర్వ మానవాళీ సుఖపడుతుంది.

- డేగల అనితాసూరి                                                 
9247500819 

English Title
True humanism
Related News