మళ్లీ గెలుపు గులాబీదే..: కేసీఆర్ 

Updated By ManamSun, 06/24/2018 - 18:26
TRS Won 99 Seats in Greater Hyderabad says cmkcr

TRS Won 99 Seats in Greater Hyderabad says cmkcr

హైదరాబాద్: సీనియర్ నేత దానం నాగేందర్‌, ఆయన అనుచరులకు గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరి అభిమానంతో టీఆర్ఎస్‌లో చేరిన దానం సహా అనుచరులకు కేసీఆర్ హృదయపూర్వక స్వాగతం పలికారు. "దానం టీఆర్ఎస్‌లో చేరి పనిచేయాలనుకున్నారు. అన్ని పార్టీల రాజకీయంగా మనది కాదు. ఇప్పుడున్నది ప్రత్యేక పరిస్థితి. టీఆర్ఎస్ పథకాలు రాజకీయం కోసం చేసింది కాదు. తెలంగాణ పునర్ నిర్మాణం యజ్ఞంగా జరుగుతోంది. మా దుష్మన్లు గట్టిగా లేరు. మావాళ్లు మొద్దుబారిపోతున్నారు. పేదల ఆర్తి నుంచి పుట్టిందే కళ్యాణ లక్ష్మి పథకం. మానవీయ కోణంలో జరుగుతున్న పాలన మనది. పవర్ సప్లైలో ఇండియాలో నెంబర్‌ వన్ స్టేట్ తెలంగాణ. నిబద్ధతతో పనిచేస్తే అవార్డులు వచ్చాయి" అని కేసీఆర్ గుర్తు చేశారు. 

                       ‘నేను రెడీ.. మీరు రెడీనా కేసీఆర్ సవాల్..!’

కష్టపడటం కోసమే..
"దానం టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు నాకు నిన్ననే చెప్పారని..దానం టీఆర్ఎస్‌లో చేరడమంటే సుఖపడటం కోసం కాదని, కష్టపడటం కోసమేనని, పని చేయాలన్న ఉద్దేశంతోనే దానం తమ పార్టీలో చేరారు. దానం నాగేందర్ ప్రజలకు నాయకత్వం వహించాలి. క్రియాశీలకంగా పనిచేస్తే మంచి పదవులు వస్తాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలతో కాంగ్రెస్ దివాళా తీసింది. తెలంగాణ అన్ని రంగాల్లో ముందుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక చరిత్ర, పునర్నిర్మాణం జరగడం మరో చరిత్ర.

నాడు తెలంగాణ ఉద్యమంలో శత్రువులు ఎంత అడ్డుపడ్డా ఎదుర్కొని ముందుకెళ్లాము. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే అర్హులందరికీ పెన్షన్లు ఇచ్చాము. సమాజంలోని బాధ, ఆవేదన, ఇతర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నాము. 90 శాతం పేదలు ఉన్న రాష్టం తెలంగాణ అని, పక్షపాత ధోరణి రూపు మాపేందుకు పథకాల లబ్ధిదారుల ఎంపికను అధికారుల చేతిలోనే పెట్టాము. లబ్ధిదారుల ఎంపికలో టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ అనే భేదం చూపలేదు" అని కేసీఆర్ స్పష్టం చేశారు.

చరిత్ర మాదే..!
"
గ్రేటర్ చరిత్రలోనే 99 సీట్లు గెలిచిన ఘనత టీఆర్‌ఎస్‌ది. ఏ ఉప ఎన్నిక వచ్చినా టీఆర్‌ఎస్‌దే విజయం. ఏ సర్వే చూసిన టీఆర్‌ఎస్‌కు వందకుపైగా సీట్లు ఖాయమని స్పష్టమవుతున్నాయి. మళ్లీ టీఆర్ఎస్‌దే విజయం ఖాయం.. టీఆర్ఎస్ అభ్యర్థులు 50 నుంచి 60 వేల మెజార్టీతో గెలిచే పరిస్థితులున్నాయి. 2020 జూన్‌లోపు చూస్తే ఎక్కడ చూసినా ఆకుపచ్చ తెలంగాణ కనిపిస్తుంది" అని ఈ సందర్భంగా సీఎం చెప్పుకొచ్చారు. 

English Title
TRS Won 99 Seats in Greater Hyderabad says cmkcr
Related News