అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసమే

Updated By ManamWed, 07/11/2018 - 19:55
TRS Wins In Upcoming Election Said Minister Jogu Ramanna

TRS Wins In Upcoming Election Said Minister Jogu Ramanna

హైదరాబాద్: టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాకుంటే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి జోగు రామన్న ప్రతిపక్షాలకు ఒకింత సవాల్ విసిరారు. బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ నేతల మాటలు ఫకీర్‌ను తలపిస్తున్నాయన్నారు. ప్రజాక్షేత్రంలో బీజేపీకి పరాభవం తప్పదని జోగు రామన్న జోస్యం చెప్పారు. బీజేపీని ప్రజలు బండకేసి ఉతకడం ఖాయమన్నారు. బీజేపీ నేతలు పగటి కలలుగంటున్నారని మంత్రి చెప్పుకొచ్చారు. 

రామన్న వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి. కాగా గత కొద్దిరోజులుగా బీజేపీ-టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొన్ని సంగతి తెలిసిందే. అయితే మరో ముందడుగేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్.. ఇటీవల టీఆర్ఎస్ నేతలపై తీవ్ర వివాదస్పద వ్యాఖ్యలు చెలరేగిన వివాదం ఇంకా సర్దుమనగలేదని చెప్పుకోవచ్చు.

English Title
TRS Wins In Upcoming Election Said Minister Jogu Ramanna
Related News