టీఆర్ఎస్‌.. 2/3 మెజార్టీ ఖాయం: కేటీఆర్

KTR, TRS govt, Telangana assembly elections 

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్‌లో ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ 2/3 మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ట్రెండ్స్ చాలా అనుకూలంగా ఉన్నాయన్నారు.

ప్రజల ఆశీర్వాదంతో టీఆర్ఎస్.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కాగా, హైదరాబాద్‌లో పోలింగ్ శాతం తక్కువగా నమోదు అయింది. ఇక పల్లెల్లో మాత్రం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ లో 53 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యధికంగా సికింద్రాబాద్ లో 56 శాతం నమోదైంది.

సంబంధిత వార్తలు