మోదీని కలిసిన టీఆర్‌ఎస్ ఎంపీలు

Updated By ManamFri, 08/10/2018 - 13:30
Narendra Modi

Narendra Modiన్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో టీఆర్‌ఎస్ ఎంపీలు శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ భూముల వ్యవహారంపై మోదీకి వినతిపత్రం అందించారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో అభివృద్ధి కార్యక్రమాల కోసం రక్షణ భూముల వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మల్కాజ్‌గిరిలోని రక్షణ శాఖ భూమిని తమకు అప్పగిస్తే అక్కడ ఫ్లైఓవర్‌ నిర్మాణం నిర్మిస్తామని.. దాని ద్వారా 44వ నంబర్‌ జాతీయ రహదారి, ఒకటో నంబర్‌ రాష్ట్ర రహదారి అనుసంధానానికి అనువుగా ఉంటుందని ఎంపీలు మోదీకి విజ్ఞప్తి చేశారు. అలాగే తెలంగాణ ప్రాంతానికి జలవనరులకు సంబంధించి జాతీయ ప్రాజెక్టును కేటాయించాలని కోరారు. వీటితో పాటు కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాలు నిర్మించేందుకు బైసన్‌పోల్‌, జింఖానా మైదానాల్లో ఏదొకటి కేటాయించాలని వారు ప్రధానిని కోరినట్లు సమాచారం.

English Title
TRS MPs meet with Narendra Modi
Related News