ఓటు వేసిన కేసీఆర్ దంపతులు

TRS Chief KCR And His Wife Sobha Cast Their Vote At Chinthamadaka

సిద్ధిపేట : టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు చింతమడక గ్రామంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  సిద్దిపేట నియోజక వర్గం చింతమడకలో  కేసీఆర్‌కు ఓటు ఉండటంతో ఆయన శుక్రవారం సతీమణి శోభాతో కలిసి ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. పోలింగ్ శాతం పెరిగిందని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారన్నారు. ఫలితాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ‘సాయంత్రం మీకే తెలుస్తుందిగా’ అని ఆయన సమాధానం ఇచ్చారు. ఇక సిద్ధిపేటలో మంత్రి హరీశ్ రావు దంపతులు ఓటు వేశారు. 

అలాగే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మంత్రి కేటీఆర్ ఖైరతాబాద్ నియోజక వర్గంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లోని నిజామియా హైస్కూల్ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. హిమాయత్ న‌గ‌ర్‌లోని సెయింట్ అంథోనిస్ స్కూల్‌లో మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ ఓటు వేశారు. ఎంపీ కవిత బోధన్ నియోజక వర్గంలోని పోతంగల్‌లో, కాంగ్రెస్ స్టార్‌క్యాంపెయినర్ విజయశాంతి  ఎమ్మెల్యే కాలనీలోని యూరోకిడ్  స్కూల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ క్లబ్ పోలింగ్ బూత్‌లో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ఓటు వేశారు.

సంబంధిత వార్తలు