రజనీ చిత్రంలో త్రిష..!

Updated By ManamThu, 08/16/2018 - 12:46
Rajinikanth, Trisha

Rajinikanth, Trishaసూపర్‌‌స్టార్ రజనీకాంత్ హీరోగా యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జరుగుతోంది. తరువాత ఈ చిత్ర షెడ్యూల్ చెన్నైలో ప్లాన్ చేశారు. కాగా ఈ చిత్రంలో త్రిష కూడా భాగం కానున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో రజనీ సరసన సిమ్రాన్ నటిస్తుండగా.. మరో కీలక పాత్ర కోసం త్రిషను ఎంచుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే త్రిష బంపర్‌ ఆఫర్ సొంతం చేసుకున్నట్లే. ఇక ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖ్వీ, బాబీ సింహా, సనత్, మేఘా ఆకాశ్ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. సన్‌పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

English Title
Trisha in Rajinikanth's movie
Related News