వాణిజ్య యుద్ధం

Updated By ManamFri, 09/21/2018 - 00:11
trade war

image‘యుద్ధాన్ని ముగించడం కంటే ప్రారంభించడం సులభం’ అని గేబ్రియల్ గార్షియా మార్క్వెజ్ ఒకసారి వ్యాఖ్యానించారు. సరిహద్దుల కోసం చేసే యుద్ధాల కంటే కాటన్ బేళ్ళు, ఆర్నమెంటల్ చేపలు, మోటార్ మోట్లు, సోయా బీన్ ఆయిల్ వాణిజ్య యుద్ధాల విషయంలో ఈ నానుడి మరింత కచ్చితంగా అన్వయిస్తుంది. చైనా దిగుమతులపై సోమవారం డోనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధం ప్రకటించి 20వేల కోట్ల డాలర్ల పన్నులు విధించారు. అందుకు చైనా ప్రతీకార చర్యలకు పూనుకుంటే మరో 26700 కోట్ల డాలర్ల సుంకాలు విధించేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం 5 వేల కోట్ల డాలర్లు విలువ చేసే చైనా వస్తువులపై సుంకాలు అమల్లో వున్నాయి. ఒకేసారి ఈ కొత్త సుంకాల్ని అమలు చేయడమా లేక దశలవారీగా విధించడమా అని అమెరికా యోచి స్తోంది. ఈ చర్యకు అంతర్జాతీయ న్యాయపరమైన అడ్డంకులు ఎదురు కాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలా సుంకాలు విధిస్తే తమకు వ్యయం పెరుగుతోందని, అంతర్జాతీయంగా సరఫరా క్రమం దెబ్బతింటుం దని పలు వాణిజ్య సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఈ వాణిజ్య యుద్ధం వల్ల వినియోగదారులపై భారం పెరుగుతోందని, నిరుద్యోగ సమస్య మరింతగా పెరిగేందుకు దోహదం చేస్తోందని, 10-25 శాతం అదనపు సుంకా లు విధించినా విస్తృత స్థాయిలో ఆర్థిక నష్టాలతో అమెరికా ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తూ గత వారం నాలుగు ప్రధాన అధు నాతన సాంకేతిక సంస్థలైన సియాస్కో, డెల్, హెచ్‌పీ ఎంటర్‌ప్రైజెస్, జూనిపర్ నెట్‌వర్క్‌లు అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయానికి ఒక లేఖ రాశాయి. అమెరికా కంపెనీలు, కార్మికులు, వినియోగదారులు, విస్తృత ఆర్థిక, వ్యూహా త్మక ప్రాధాన్యతలన్నీ ప్రమాదంలో పడతాయని ఆ లేఖ పేర్కొన్నప్పటికీ కార్పొరేట్ ఆయిల్ లాబీతో అంటకాగుతున్న ట్రంప్ ప్రభుత్వం చైనాతో వాణి జ్య యుద్ధాన్ని తీవ్రతరం చేసేందుకు నిర్ణయం తీసుకోవడం ఆత్మహత్యా సదృశ్యం.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో చైనీస్ సంస్థల నుంచి అమెరికన్లు కొనుగోలు చేసే 505 బిలియన్ ఉత్పత్తుల్లో సగానికి పైగా, ఉత్పత్తులు కొత్త సుంకాల భారాన్ని ఎదుర్కొనవలసి వస్తుంది. జూలైలో మొదటిసారి ట్రంప్ 50 బిలియన్ డాలర్ల సుంకాలతో చైనాపై వాణిజ్య యుద్ధం ప్రధానంగా పారి శ్రామిక ఉత్పాదక సరుకులపై విధించగా, నేడు వినియోగదారుల ఉత్పుత్తులైన ఎయిర్ కండిషనర్లు, స్పార్క్ ప్లగ్‌లు, ఫర్నీచర్, లాంప్స్ వంటి వాటిపై విధిం చడంతో సామాన్య ప్రజలపై మోయలేని ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 24 నుంచి ప్రభావిత వస్తువులకు అమెరికా దిగుమతిదారులు అద నంగా 10 శాతం సుంకాలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ సుంకాలు 25 శాతానికి పెరుగుతాయని అమెరికా అధికారులు తెలియజేస్తున్నారు. వర్ధమాన దేశాలైన చైనా, ఇండియా సరుకుల దిగుమతు లపై వాణిజ్య మినహాయింపులు అందించడం వల్ల అమెరికా నష్టపోతోందని, అమెరికాను అభివృద్ధి చెందిన దేశంగా కాక, వర్ధమాన దేశంగా పరిగణిస్తూ  ఆ మినహాయింపులను రద్దు చేయాలని ఇటీవలి ట్రంప్ ట్వీట్ సంచలనం సృష్టించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాల సంపదకు చైనా పెనుముప్పుగా పరిణమించడంతో ఆ దేశ వాణిజ్య పద్ధతుల మార్పు కోసం ఈ సుంకాలను విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. గత కొన్ని నెలలుగా చైనా అన్యాయమైన పద్ధతులపై యుద్ధం చేస్తున్నామని ఆయన ప్రకటించారు. ట్రంప్ అంతర్జా తీయ ఒప్పందాలపై కాకుండా గొడవ చేసి లబ్ధిపొందాలని కలలు కంటున్న నేపథ్యంలో మార్క్వెజ్ నానుడిని ప్రస్తావించడం అనుకోని అన్వయం కానేకాద నిపిస్తుంది. చైనా అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం ముగిసేందుకు రెండు దశాబ్దాల కాలం పట్టొచ్చని, ఒకవేళ స్వల్పకాల పరిష్కారం కోసం ప్రయత్నిస్తే, అసలు పరిష్కారమే లేని స్థితి ఏర్పడుతుందని బిలియనీర్ జాక్ మా జోస్యం నిజమేననిపిస్తుంది. 

అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో భాగంగా వివిధ దేశాలతో అమెరికాకున్న వాణిజ్య లోటును సరిచేసేందుకు సంబంధిత దేశాల ఉత్పత్తులపై సుంకాలు విధించేందుకు శ్రీకారం చుట్టారు. ‘వాణిజ్య యుద్ధాలు మంచివే. అవి సులభంగా గెలిచేందుకు ఉపకరిస్తాయి’ అని ట్రంప్ ట్వీట్ చేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కంపనలు సృష్టించారు. మొదటగా చైనా, భారత్, ఈయూ దేశాల ఉక్కు, అల్యూమినియం ఉత్పు త్తులపై అధిక సుంకాలు విధించి స్వదేశీ పరిశ్రమలకు ఊపిరినివ్వడం ద్వారా అమెరికన్ యువతను నిరుద్యోగ సమస్య నుంచి బయట పడవేయగలనని ట్రంప్ పగటికలలు కంటున్నాడు. అయితే తాను ఉత్పత్తి చేస్తున్న ఉక్కు పరి మాణం కంటే అధికంగా వినియోగిస్తుండడం వల్ల ఉక్కు దిగుమతిపై సుంకాల వల్ల అమెరికా పరిశ్రమలకు ఊపిరాడకుండా పోతుందన్న సరళమైన ఆర్థిక విషయం ట్రంప్ ప్రభుత్వానికి అర్థం కాకపోవడంపై నిపుణులు ముక్కున వేలే సుకుంటున్నారు. ఆర్థిక రంగంలో దూకుడుగా ముందుకొస్తున్న చైనాకు చెంది న  ఉత్పత్తులపై  అమెరికా సుంకాలు విధించగా, అందుకు ప్రతిస్పందనగా చైనా కూడా అంతే మోతాదులో అమెరికా దిగుమతులపై సుంకాలు వడ్డించింది. 
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మూలంగా మిగతా దేశాల ఆర్థిక వ్యవ స్థలు కూడా ప్రమాదంలో పడనున్నాయి.
 

అయితే ప్రపంచ వాణిజ్య సమీ కరణాలు కీలకంగా మారబోతున్న సందర్భంలో సుంకాల కారణంగా సరుకుల పోటీలో చైనా వాణిజ్యం వెనుకబడిన ప్రాంతాల్లో, ఆ అవకాశాలను వినియో గించుకొని భారతీయ సరుకులు దూసుకుపోవాలి. అంతర్జాతీయంగా రాబో తున్న వాణిజ్య అవకాశాలను వినియోగించుకునేందుకు ‘మేక్ ఇన్ ఇండి యా’ నినాదంతో దేశీయ వస్తూత్పత్తి రంగాన్ని వేగంగా అభివృద్ధి చేసుకో వలసిన తరుణమిది. విచక్షణా రహితంగా, దూకుడుగా అమెరికా తీసుకుంటు న్న నిర్ణయాలు అంతర్జాతీయ సమాజాన్ని యుద్ధోత్పాతం వైపునకు వడివడిగా నడిపిస్తున్నాయి. రక్తరహిత ప్రపంచ యుద్ధంగా ప్రారంభమైన భౌగోళిక రాజ కీయాలు రక్తసిక్త రాజకీయ ప్రపంచ యుద్ధంగా పరిణమించే ప్రమాదం లేకపోలేదు. 
 

English Title
trade war
Related News