తొలిసారి టీపీసీసీ క్రమశిక్షణ చర్యలు

Updated By ManamWed, 06/13/2018 - 16:15
TPCC Sacks Konagala Mahesh As Media Coordinator
  • పార్టీ అధికార ప్రతినిధి కొనగాల మహేష్‌పై టీపీసీసీ వేటు

TPCC Sacks Konagala Mahesh As Media Coordinatorహైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ మొదటి సారి క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ అధికార ప్రతినిధి కొనగాల మహేష్‌పై వేటు వేసింది. పార్టీలో అనేక ఫిర్యాదులు రావడంతో కొనగాల మహేష్‌ను అధికార ప్రతినిధి, మీడియా కన్వీనర్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు తెలంగాణ పీసీసీ బుధవారం ప్రకటించింది. కాగా,  బీజేపీకే చెందిన ఆది శ్రీనివాస్ హస్తం కండువా కప్పుకోవడంతో వేములవాడ నియోజకవర్గంలో అంతర్గతంగా ఉన్న విభేదాలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. ఆది శ్రీనివాస్  చేరికను వ్యతిరేకిస్తూ వేములవాడ నియోజకవర్గంలో  కొనగాల మహేష్ ఓ గ్రూప్‌గా ఏర్పడి రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో మహేష్‌పై అధిష్ఠానానికి ఫిర్యాదు అందటంతో అతడిపై చర్యలు తీసుకుంది.

Tags
English Title
TPCC Sacks Konagala Mahesh As Media Coordinator
Related News