తేజ్ కోసం టాప్ టెక్నీషియన్లు

Updated By ManamMon, 07/09/2018 - 10:08
sai dharam tej

Devi SRi Prasadవరుసగా ఆరు పరాజయాలతో ఢీలా పడ్డ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. ఒక్క హిట్ కోసం చాలా ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో ఫ్యామిలీ డైరక్టర్‌ కిశోర్ తిరుమలకు ఓకే చెప్పిన ఈ హీరో.. త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఇక ఈ చిత్రానికి ‘చిత్ర లహరి- బార్ అండ్ రెస్టారెంట్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తుండగా.. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి టాప్ టెక్నీషియన్స్ పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ‘నిన్నుకోరి’, ‘కార్తికేయ’, ‘ప్రేమ ఇష్క్ కాదల్’ వంటి చిత్రాలకు పనిచేసిన కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నట్లు సమాచారం. అలాగే కిశోర్ తిరుమల ముందు రెండు చిత్రాలకు పనిచేసిన దేవీ శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతాన్ని అందించనున్నట్లు తెలుస్తోంది. ఇక తండ్రి, కుమారుల మధ్య కథగా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఇందులో తేజ్ సరసన హలో ఫేం కల్యాణి ప్రియదర్శన్, గురు ఫేం రితికా సింగ్ నటించనున్నారు.

English Title
Top Technicians for Sai Dharam Tej
Related News