అగ్రస్థానంలోనే టీమిండియా

Updated By ManamThu, 09/13/2018 - 04:12
team-india
  • ఐసీసీ  టెస్టు ర్యాంకింగ్స్

team-indదుబాయ్: టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిం డియా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుం ది. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకిం గ్స్‌లో భారత్ జట్టు 10 పాయింట్లు కోల్పోయి అగ్ర స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ జట్టు 1-4తో ప్రత్యర్థి జట్టుపై ఓడిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తున్న భారత్ జట్టు ఈ టెస్టు సిరీస్ ఓటమితో 115 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సిరీస్‌కు ముందు టీమిండియా 125 పాయిం ట్లతో ఇంగ్లాండ్‌తో బరిలోకి దిగింది. ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు మంగళవారం 118 పరుగులతో ఓడిపోయింది. భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టెస్టు ర్యాంకింగ్స్‌లో 97 పాయింట్లతో 5వ స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు, న్యూజిలాండ్ జట్టుని వెనక్కినెట్టి ప్రస్తుతం 105 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్ కంటే ముందు వరుసగా రెండు, మూడు స్థానాల్లో 106 పాయింట్లతో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఉండగా, ఐదోవ స్థానంలో 102 పాయింట్లతో న్యూజిలాండ్ జట్టు ఉంది. ఇక బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ యథావిధిగా నెంబర్ వన్ ర్యాంకుల్లో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో కోహ్లీ 59.30 సగటుతో 593 పరుగులు చేశాడు. బౌలర్లలో ఇంగ్లాండ్‌కు చెందిన జెమ్స్ ఆండర్సన్ మొదటి స్థానంలో స్థిరంగా ఉన్నాడు.

Tags
English Title
The top-ranked team
Related News