మూలవాసుల చరిత్రకు తూట్లు

Updated By ManamThu, 08/09/2018 - 04:19
adivasi

imageబ్రిటీష్ సైన్యానికి స్వాతంత్రోద్యమానికి ముందు ముచ్చమటలు పట్టిం చిన ఆదివాసీ ధీరుల ఘనచరిత్రకు తగిన ఆదరణ లేక వెలవెలబోతున్నా యి గిరిజన ప్రాంతాలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ఫలితంగా ఆదివాసీ చరిత్ర వెలుగుకు నోచుకోలేదు. 1815 నుంచి 1830 వరకు బ్రిటీష్ సైన్యం చేతుల్లో ఉన్న దేశంలో ఒక్క ఆదివాసీలు మాత్రమే సైన్యం ఏర్పాటు చేసుకున్నారు. అడవిలోని వనరులను దోచుకునేందుకు గోండు రాజ్యాలను ధ్వంసం చేసే కుట్రలో భాగంగా ఆదివాసీలను నిర్భంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నారని బ్రిటీష్, నిజాం ప్రభుత్వాలను రాంజీగోండ్ గడగడలాడిం చారు. గోండు వీరుడు రాంజీగోండ్ మరణస్థలంలో అమరధామాన్ని ఏర్పాటు చేస్తామని గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. నిర్మల్ కేంద్రంగా గోండు రాజులు పరిపాలించిన కోటలు నేటికీ సజీవంగా ఉన్నాయి. ఒక్క ఉమ్మడి జిల్లాలోనే కాకుండా మహా రాష్ట్రలోని చంద్రపూర్ ప్రాంతంలో గోండ్వ న రాజ్యాలు ఉన్నాయి. ఆ రాజ్యాలను స్వాధీనపర్చుకునేందుకు బ్రిటీష్ సైన్యం నిజాం ప్రభుత్వంతో రహస్య ఒప్పందం చేసు కుని నిర్మల్‌ను అడ్డాగా చేసుకున్నారు. హైదరాబాద్‌లో రాంజీగోండ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఆనాడు నిర్మల్ తాలూకా గా ఉండి, వేల ఏండ్ల క్రితం స్వాతంత్య్ర సంగ్రామంలో పోరాటం చేసేందుకు ఇక్కడి నుంచే సన్నాహకాలు చేశారు. ఆదివాసులైన రాజ్ గోండ్, గోండ్, నాయక్‌పోడ్, కోయ, కోలాం, మనేవార్లు, కోయతురు, పరాదన్ తోటి, అంద్‌లు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. మన రాజ్యం పైకి తెల్లదొరలు వచ్చారని, వారిని ఎదుర్కోవాలని సూచిస్తూ అందరినీ ఏకం చేశాడు రాంజీ గోండ్. రాంజీగోండ్ ఆంగ్లేయులపై పోరాటం చేసేం దుకు ఆయుధాలను ఏర్పాటు చేసుకొని యుద్ధానికి సన్నద్ధమైయ్యారు. అడవులు, కొండలను ఆసరాగా చేసుకుని గెరిల్లా యుద్ధాన్ని ఎంచు కున్నారు. బ్రిటీష్ సైన్యం నిజాం ప్రభుత్వంతో లోపాయికారి ఒప్పందం చేసుకుని గోదావరి తీరాన నివసించే ఆదివాసులపై నిర్మల్ కలెక్టర్ ఆధ్వ ర్యంలో నిజాం, ఆంగ్లేయుల సైన్యంతో దాడులకు దిగింది. దొంగదెబ్బతో ఆదివాసులను పట్టుకుంది. అంతే కాకుండా రాంజీగోండ్ సహా వెయ్యి మంది ఆదివాసీ వీరులను పట్టుకొని  నిర్మల్ కేంద్రానికి సమీపంలో ఉన్న ఊడల మర్రికి ఊరితీశారు. 1987 వరకు ఊడలమర్రి ఆనవాళ్లు కన్పించేవి. మన పాలకుల నిర్లక్ష్యానికి ప్రస్తుతం అవి జాడ లేకుండా పోయాయి. ఇలాంటి చరిత్ర కల్గిన నిర్మల్ ప్రాంతానికి గుర్తింపు ఇవ్వకుండా హైదరాబాద్‌లో రాంజీగోండ్ అమరధామం నిర్మిస్తే ఎవరికి ఉపయోగం?. ఆదివా సుల కోసం ఐక్యరాజ్యసమితి ఎన్నో రాజ్యాంగ హక్కులు కల్పించాలని తీర్మానాలు చేసి దేశాలకు సూచిస్తోంది. కానీ అలాంటివీ ఎక్కడా కల్పించలేదు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9న నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి గుర్తింపునిచ్చింది. మన ప్రభుత్వాలు అధికారికంగా ఇప్పటివరకు నిర్వహించిన దాఖ లాల్లేవు. ఇదే ఆదివాసులకు ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు. కనీసం పాఠ్యపుస్తకా ల్లోనూ ఆదివాసుల చరిత్రను ముద్రిం చలేదు. ప్రభుత్వం వెయ్యి ఊడలమర్రి స్థలంలో అమరధామాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమయ్యాక ఆయనను స్మరిస్తూ ఉద్యమకారులు, విప్లవ సంఘాల ఆధ్వర్యంలో 2007 నవంబర్ 14న వెయ్యి ఊడలమర్రి వద్ద స్థూప నిర్మాణం చేపట్టారు. దాన్ని ఉమ్మడి ప్రభుత్వం అడ్డుకుంది. మళ్లీ 2008 నవంబర్ 14న నిర్మల్ చైన్ గేట్ సమీపంలో రాంజీగోండ్ విగ్రహం ఏర్పాటు చేశారు. ఆదివాసుల చరిత్ర కనుమరుగు కాకుండా ఉండాలంటే.. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్మల్‌లోని వెయ్యి ఊడలమర్రి స్థలంలో అమరధామం, నిర్మల్ జిల్లా కేంద్రంలో మ్యూజియం నిర్మించాలి. ఆదివాసీల సంస్కృతి, ఆచారాలు సహా చరిత్రను సజీవంగా ఉంచడానికి ఈ చరిత్రను పాఠ్యాంశాల్లో చేరిస్తే.. ఆదివాసీ వీరుడు రాంజీగోండ్‌తో పాటు వారి సంస్కృతిని గౌరవించనట్లవుతుంది. రాంజీగోండ్ కోసం కేంద్ర ప్రభుత్వం పంపిన రూ.15 కోట్ల నిధులతో నిర్మల్‌లో అమరధామం నిర్మాణం చేపడితే ఆదివాసీ వీరుడు రాంజీగోండ్ చరిత్ర భవిష్యత్ తరాలకు అందించిన వారవుతారు.
 వేంకగారి భూమయ్య

English Title
Toots to the history of the indigenous people
Related News