నేటి నుంచి బీసీల ఆత్మగౌరవ మహాసభలు

Updated By ManamMon, 10/15/2018 - 23:42
bc's meetings
  • ఖమ్మం నుంచి శ్రీకారం: జాజుల శ్రీనివాస్‌గౌడ్  

imageహైదరాబాద్:  వచ్చే ఎన్నికల్లో బీసీలకు సరైన ప్రాధాన్యత ఇవ్వని రాజకీయ పార్టీలకు ఓటమి తప్పదని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్  తీవ్రంగా హెచ్చరించారు. టికెట్ల కేటాయింపులో బీసీలకు వాటా దక్కాలనే డిమాండ్‌తో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరిని కలుపుకుని  రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి బడుగుల ఆత్మగౌరవ మహాసభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. సోమవారం ఆయన ఆత్మగౌవర మహాసభ వాల్‌పోస్టర్‌ను ఇతర బీసీ సంఘాల నేతలతో కలిసి ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ 16న ఖమ్మం జిల్లా కేంద్రంలో, 20 భువనగిరి జిల్లా మోత్కూరులోని దాచారం, దసర పండుగ తరువాత నర్సాపూర్, వరంగల్, సూర్యపేట, నర్సంపేట, దేవరకద్ర, మునుగోడు, కొల్లాపూర్, బాల్కొండ నియోజకవర్గాల కేంద్రాల్లో వేలాదిమందితో భారీ మహాసభల నిర్వహించి తమ తడఖా చూపిస్తామన్నారు. టీఆర్‌ఎస్ జాబితాను ఇప్పటికైనా మార్చుకోవాలని మిగిలిన 14సీట్లను బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.

మహాకూటమి, బీజేపీలు 50శాతం అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని, లేని పక్షంలో తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. బీసిలకు టికెట్లు నిరాకరించే పార్టీలు ఎన్నికల ప్రచారంలో పూలే, అంబేద్కర్ చిత్రపటాలు ఉపయోగించుకునే నైతిక హక్కులేదన్నారు. బీసీలకు రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇస్తే అధికారం పీఠం అందిస్తాం, అణిచి వేసే ఎత్తుగడలు వేస్తే సింగిల్ సీటుకే పరిమితం కాకతప్పదన్నారు.

English Title
From today bc's meetings
Related News