నేడే ‘అల్జీమర్స్’ మారథాన్

Updated By ManamFri, 09/21/2018 - 02:00
Alzheimer's Marathon
  • ఉస్మానియాలో అవగాహన సదస్సు  

imageహైదరాబాద్: ప్రపంచ అల్జీమర్ దినోత్సవం పురస్కరించుకుని నేడు  హైటెక్ సిటీలోని ఫినిక్స్ ఎరేనాలో రెడ్‌క్రాస్ నైటీంగేల్ అధ్వర్యంలో మారథాన్ రన్‌ను, ఉస్మానియా దవాఖానాలో అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు. ఈ సందర్భంగా  ప్రొఫెసర్ డాక్టర్ నాగేందర్ మాటా ్లడుతూ  ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదిన ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తు న్నట్టు తెలిపారు. జన్యు సంబంధిత కారణాలతో చిన్న వయస్సులోనే ఈ వ్యాధి ఏర్పడే అవకాశం ఉంటుందన్నారు. ఈ సమస్యతో తీవ్రమైన జ్ఞాపకశక్తి సమస్యలు ఎదురవుతుంటాయని తెలిపారు. మాట్లాడటం రాయడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఇతరులపై ఆధారపడాల్సి వస్తుందని తెలిపారు.  ఈ వ్యాధికి సంబంధించిన అన్ని రకాల చికిత్సలు పరీక్షలు ఉస్మానియా, గాంధీ తదితర ప్రభుత్వ దవాఖానాల్లో అందుబాటులో ఉన్నాయని సూపరింటెండెంట్ తెలిపారు.

English Title
Today is the Alzheimer's Marathon
Related News