వెంకీ, చైతూ మూవీ టైటిల్ ఫిక్స్..?

Updated By ManamMon, 06/04/2018 - 15:30
Venky, Chaithu

Venky, Chaithu వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా దర్శకుడు బాబీ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మామ-అల్లుళ్ల మధ్య సాగనున్న ఈ కథ కోసం ‘వెంకీ మామ’ అనే టైటిల్‌ను పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా ఈ మూవీలో వెంకీ సరసన హ్యూమా ఖురేషి, చైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్‌ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

 

English Title
Title fix for Venkateshm Chaitanya multi  Starrer
Related News