తిరుమల శ్రీవారి సమాచారం

Updated By ManamThu, 07/12/2018 - 08:35
Tirumala Lord Venkanna Devotees Information

Tirumala Lord Venkanna Devotees Information

తిరుపతి: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్న సన్నిధిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో గదులన్నీ భక్తులతో నిండిపోయి.. సర్వదర్శనం కోసం భక్తులు క్యూ కాంప్లెక్స్ బయట వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2గంటలు, నడకదారి భక్తులకు ఉదయం 9 గంటలు, ఉచిత దర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా.. వెంకన్న దర్శనానికి నడక మార్గమైన అలిపిరిలో 14 వేలు, శ్రీవారి మెట్టులో 6 వేలు దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.  

ఇదిలా ఉంటే..  బుధవారం ఒక్కరోజే తిరుమల వెంకన్నను 69,768 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ.2.93 కోట్లు. 33,991 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్టు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.

English Title
Tirumala Lord Venkanna Devotees Information
Related News