రాష్ట్రమంతా పెండ్లి సందడి

Updated By ManamThu, 07/05/2018 - 01:15
image
  • నేడు దివ్యమైన ముహూర్తం.. ఒక్కటి కానున్న వేల జంటలు 

image

హైదరాబాద్: రాష్ట్రానికి పెండ్లి కళ వచ్చింది. గురు, శుక్ర, శనివారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50వేలకు పైగా పెళ్లిళ్లు జరుగబోతున్నట్టు అంచనా. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పెండ్లి సందడే కనిపిస్తోంది. ఈ నెల 5, 6, 7 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయని పండితులు పేర్కొంటున్నారు. తర్వాత ఆగష్టు 15 వరకు మళ్లీ ముహూర్తాలు లేవనడంతో ఈ మూడు రోజులు భారీ సంఖ్యలో వివాహాలు జరుగనున్నాయి. మూడు రోజుల పాటు ముహుర్తాలు ఉన్నా.. అందులో ఈ నెల 5వ తేదీ దివ్యమైన ముహూర్తమని పండితులు చెబుతున్నారు. గురువారం, తిథి సప్తమి వచ్చింది. సప్తమి అంటే ఏడు, వివాహా సమయంలో నవ దంపతులు ఏడు అడుగులు కలిసి నడుస్తారు. దీంతో సప్తమిని అందరూ ఖరారు చేసుకుంటున్నారు. ఉత్తరాభాద్ర నక్షత్రం సెంటిమెంట్ బలంగా విశ్వసిస్తుండటంతో వారం, తిథి, నక్షత్రం మూడు అంశాలు ఒకే తేదీన బలమైనవి కావడంతో అంతా ఆ వైపుగా పరుగులు పెడుతున్నారు.

ఈ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా జంటలు ఒక్కటవుతున్నాయి. ఈ ముహూర్తంలో పెళ్లి జరిగితే దంపతుల జీవితం అన్యోన్యంగా ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు. జూన్ మాసమంతా అధిక జేష్ఠమాసం. దీంతో ఇంట్లో  పెళ్ళిళ్లు చేసే వీలు లేకుండా పోయింది. ఈ నెల 13 నుంచి ఆషాడం మొదలవుతోంది. ఆషాడంలో ఎలాంటి శుభకార్యా లు మొదలుపెట్టరు. ఈ నెల 13 నుంచి ఆగస్టు 11 వరకు అంటే సుమారు నెలకు పైగా ఆషాడమాసం ఉంటుంది. ఆగస్టు 11నుంచి శ్రావణమాసం మొదలవుతోంది. కాగా 5న దివ్యమైన మూహ్తూరం ఉండటంతో అందరి దృష్టి ఆ తేదీపైనే పడింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా ఫంక్షన్ హాళ్ళకు భారీగా డిమాండ్ పెరిగింది. ఇప్పటికే బట్టల దుకాణాలు, బంగారు దుకాణాల్లో హడావుడి నెలకొంది. పురోహితులకు చెప్పలేనం త డిమాండ్ వచ్చింది. వివాహాలతో పాటు ఆస్తుల రిజిస్ట్రేషన్, ఇళ్ళ నిర్మాణానికి భూమి పూజ, స్లాబ్ వంటి నిర్మాణాలకు శ్రీకారం చుడుతున్నారు.

English Title
time to wedding
Related News