తోట విజయలక్ష్మి ప్రమాణ స్వీకారం

Updated By ManamFri, 09/14/2018 - 15:21
vijayalakshmi thota
  • బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా తోట విజయలక్ష్మి బాధ్యతలు

vijayalakshmi thota

విజయవాడ : బీజేపీ రాష్ట్ర మహిళ మోర్చా అధ్యక్షురాలిగా తోట విజయలక్ష్మి శుక్రవారం ప్రమాణ స్వీకారం  చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, గోకరాజు గంగరాజు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ...బీజేపీలో మహిళలకు మంచి గుర్తింపు ఉందన్నారు. ఐదుగురు మహిళలు ఎన్డీఏ హయాంలో గవర్నర్‌లుగా పని చేసిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం ఆరుగురు మహిళలు కేబినెట్‌లో మంత్రులుగా పని చేస్తున్నారని, కీలకమైన రక్షణ మంత్రి బాధ్యతలు నిర్మలా సీతారామన్‌కు మోదీ అప్పగించారన్నారు. అలాగే మహిళలు కోసం జనధన్ ఖాతాలను ప్రధాని తెరిపించారన్నారు.

మహిళల సంక్షేమం కోసం మోదీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ...గర్భిణీ మహిళకు పౌష్టికాహారం కోసం రూ.6వేలు వారి ఖాతాల్లో వేస్తున్నారని, ముస్లిం మహిళ కోసం ట్రిపుల్ తలాఖ్ బిల్లును తెచ్చారని పురందేశ్వరి తెలిపారు. టీడీపీ హయాంలో కాల్ మనీ వలన మహిళలు అనేక ఇబ్బందులు పడ్డారని ఆమె విమర్శించారు.

English Title
Thota Vijayalakshmi take a charge of BJP Mahila Morcha president
Related News