ముచ్చటగా మూడోసారి ‘అప్ప’

Updated By ManamThu, 05/17/2018 - 22:56
image
  • క్లర్కు నుంచి సీఎం సీటు వరకు 

  • 15వ ఏట నుంచే సంఘ్‌తో బంధం

  • ఎమర్జెన్సీ సమయంలో జైలుజీవితం

imageబెంగళూరు: ముచ్చటగా మూడో సారి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన బూకనకెరె సిద్దలింగప్ప యడ్యూరప్ప... 2008 లోనే దక్షిణాదిలో మొట్టమొదటి బీజేపీ సీఎంగా చరిత్ర సృష్టించారు. ‘గాలి’ సోదరుల మైనింగ్ మాఫియా అవినీతిలో తీవ్ర ఆరోపణలు ఎదు ర్కొని, లోకా యుక్త కూడా దోషిగా తేల్చగా, ఐదు కోర్టు కేసు లు, జైలు జీవితం వంటివి ఆయన ను రాజకీ యంగా అథఃపాతాళానికి పడేశాయి. అవినీ తి మకిలితో పార్టీకి కొరకరాని కొయ్యగా మారా రు. దీంతో బీజేపీ అధిష్ఠానం తనను పక్కన పెట్టింద ని అలిగి.. ఏకంగా బీజేపీకి గుడ్‌బై కొట్టి తన మద్దతుదారులతో సొం తంగా ‘కర్ణాటక జనతా పక్ష’ పార్టీ పెట్టుకున్నారు. తర్వాత 2014 లో తన పార్టీని బీజేపీ లో విలీనం చేసి పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు చేప ట్టి.. ‘మళ్లీ పార్టీని అధికారం లోకి తెచ్చే వరకు సొంతూ రి లో కాలు పెట్టను’ అని శప థం చేసి.. తాజాగా ఎన్నిక ల్లో విజయం సాధించి తన మాట నిలబెట్టుకున్నారు. 

ఒకే ఒక్క చాన్స్ అంటూ..
1994లో ప్రతిపక్ష నేతగా ఎదిగి.. ఆ తర్వాత ఒకే ఒకసారి 1999 ఎన్నికల్లో మాత్రమే ఓటమిని చవి చూసి, తిరుగులేని నేతగా ఎదిగిన యడ్యూరప్ప రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన ఘనత మాత్రం కుమారస్వామిదే. కాంగ్రెస్‌ను అధికారానికి దూరం చేయాలన్న ఏకైక లక్ష్యంతో జేడీఎస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యడ్డి, ఆ తర్వాత కుమారస్వామి చేతిలో మోసపోయారు. జేడీఎస్‌తో బీజేపీ చేసుకు న్న ఒప్పందం ప్రకారం తొలి 20 నెలలు కుమార స్వామి సీఎంగా, యడ్యూరప్ప డిప్యుటీగా అధికా రంలో ఉండాలని, ఆ తర్వాత అప్పకు సీఎంగా చాన్స్ ఇవ్వాలన్న ఒప్పందాన్ని కుమారస్వామి తుంగలో తొక్కడంతో ఎన్నికలు తప్పలేదు. ‘‘న న్ను జేడీఎస్ మోసం చేసింది. ఒకే ఒక్క చాన్స్ ఇ వ్వండి’’ అంటూ ఎన్నికల్లో అభ్యర్థించిన యడ్డికి ప్రజలు పట్టం కట్టడంతో ఆయన దశ తిరిగింది. 75 ఏళ్ల యడ్యూరప్పను కన్నడ ప్రజలు ‘యడి’్డ లేదా ‘అప్పా’ లేదా ‘బీఎస్‌వై’ అని పిలుస్తారు. కర్ణాటకలో బీజేపీకి ముఖచిత్రంగా ఉన్న యడ్యూరప్పను భవిష్యత్‌లో కూడా సీఎంగా కొనసాగిస్తారా అన్న అంశంపై అప్పుడే అనుమానాలు కూడా ముసురుకున్నా యి. 75 ఏళ్లు దాటాక మంత్రి పదవులు చేపట్టరాదన్న బీజేపీ అనధికారిక నియమం ప్రకారం యడ్డిని తప్పించి ఆయన స్థానంలో మరెవరినైనా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడ తారనే అంచనాలు సైతం లేకపోలేవు. ప్రస్తుతానికి రాష్ట్రంలో బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్న యడ్యూ రప్పకు ప్రత్యామ్నాయ నేత ఎవరూ లేరు. 

క్లర్కు నుంచి సీఎం వరకు...
ఒకప్పుడు ప్రభుత్వ క్లర్కుగా ఉద్యోగ జీవితం మొదలుపెట్టిన యడ్యూరప్ప.. ఆ తర్వాత హార్డ్‌వేర్ స్టోర్ యజమానిగామారి, అటుimage నుంచి సీఎం పదవి వరకు ఎదిగారు. 15 ఏళ్ల వయసులోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. 70ల్లో షికారిపురా తాలూకా జనసంఘ్ చీఫ్ అయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లి తర్వాత సాంఘిక సంక్షేమ శాఖలో క్లర్కుగా చేశారు.  కొన్నాళ్ల తర్వాత శివమొగ్గలో హార్డ్‌వేర్ దుకాణం తెరిచారు. 2004లో కూడా బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించడంతో అప్పుడూ అప్పకు సీఎం అయ్యే చాన్స్ వచ్చింది. కానీ కాంగ్రెస్-జేడీఎస్ చేతులు కలపడంతో ధరమ్ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. మళ్లీ ఇన్నాళ్లకు ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ నాయకుడిగా.. ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టగలిగారు. 

English Title
The third time 'Appa'
Related News