వీరే బిగ్ ‘సి’ కారు విజేతలు 

Updated By ManamTue, 11/06/2018 - 22:15
Big-C-Winners-Announcement

Bigహైదరాబాద్: బిగ్ ‘సి’ సంస్థ ‘దసరావళి డబుల్ ధమాకా ఆఫర్’ 4వ వారం లక్కీ డ్రా విజేతలను ప్రకటించింది. శ్రీనివాస్, కె. వెంకటేష్, రాంబాబు, బి. రమేష్, దీపికా రెడ్డి, ఆర్. పూర్ణిమ, జి. కిరణ్‌కుమార్‌లు కారు విజేతలుగా నిలిచినట్లు బిగ్ ‘సి’ సంస్థ స్థాపకుడు, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎం.బాలు చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటో, రెండో, మూడో వారం లక్కీ డ్రా విజేతలకు ప్రముఖ సినీ తార అనూ ఇమాన్యుయేల్ ఒక కార్యక్రమంలో కార్లను అందజేసినట్లు ఆయన తెలిపారు. ‘దసరావళి డబుల్ ధమాకా ఆఫర్’ పేరిట బిగ్ ‘సి’ సంస్థ 42 రోజుల్లో 252 బహుమతులు అందజేయాలని నిర్ణయిం చింది. బిగ్ ‘సి’లో మొబైల్ ఫోన్లు కొన్నవారికి ఈ లక్కీడ్రాలో పాల్గొనే అర్హత ఉంటుంది. కార్లతోపాటు బజాజ్ ప్లాటినా బైక్‌లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎల్‌ఈడీ టీవీ సెట్లను బిగ్ ‘సి’ సంస్థ బహుమతిగా అందజేస్తోంది. 

English Title
These are the Big 'C' car winners
Related News