అప్పుడు ట్రాక్ట‌ర్‌.. ఇప్పుడు ఆటో..

Updated By ManamThu, 05/17/2018 - 18:22
sai pallavi

sai pallavi‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్న తమిళ అమ్మాయి సాయిపల్లవి. తొలి చిత్రంతోనే సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. దాంతో ఈ అమ్మడుకి వరుస అవకాశాలు వచ్చాయి. నానితో 'ఎం.సి.ఎ', నాగశౌర్యతో 'కణం' సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. తమిళంలో రెండు సినిమాలు ఓకే చేసింది. అందులో ఒకటి హీరో సూర్యతో చేస్తున్న ‘ఎన్.జి.కె’ కాగా.. మరో సినిమా ధనుశ్‌తో చేసే ‘మారి 2’. ఈ సినిమాలో సాయిపల్లవి సరికొత్త పాత్రలో ప్రేక్షకులను మెప్పించనుంది. అదేదో కాదు.. ఆటో డ్రైవర్‌ పాత్రలో. ఈ పాత్ర కోసం సాయిపల్లవి ఆటో డ్రైవర్‌గా ట్రైనింగ్ కూడా తీసుకుంటుంది. 'ఫిదా'లో ట్రాక్టర్ నడిపి కుర్రకారును ఆకట్టుకున్న సాయిపల్లవి ఈసారి ఆటోను నడుపనుందన్నమాట.

బాలాజీ మోహ‌న్ రూపొందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో తెర‌పైకి రానుంది. అన్న‌ట్టు.. శ‌ర్వానంద్ హీరోగా రూపొందుతున్న 'ప‌డి ప‌డి లేచె మ‌న‌సు'లోనూ సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇందులో బెంగాలీ అమ్మాయిగా ఈ అమ్మ‌డు సంద‌డి చేయ‌నుంది.

English Title
then tractor.. now auto..
Related News