ఆలోచింపచేసే చిత్రం

Updated By ManamSun, 10/21/2018 - 09:59
thaneesh

imageయు అండ్ ఐ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై తనీశ్, పరుచూరి రవి, ప్రియా సింగ్, పరుచూరి వెంకటేశ్వర రావు, షఫీ, పోసాని కృష్ణమురళి ప్రధాన తారాగణంగా రూపొందు తోన్న చిత్రం ‘రంగు’. కార్తికేయ.వి దర్శకుడు. ఎ.పద్మనాభరెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నిర్మాతలు. శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను పరుచూరి వెంకటేశ్వర రావు విడుదల చేశారు. హీరో తనీశ్ మాట్లాడుతూ ‘‘విజయవాడలో లారా అనే వ్యక్తి పాత్రలో నేను కనపడతాను. పాత్ర నాలుగు వేరియేషన్స్‌తో సాగుతుంది. నాకు చాలెంజింగ్‌గా అనిపించింది. ఇందులో హీరోలు, విలన్స్ అంటూ ప్రత్యేకంగా ఉండరు. పరిస్థితుల ప్రభావం కనపడు తుంది. ప్రతి మనిషిలో మంచి, చెడు ఉంటాయి. అది ఎదుటి అంశాన్ని చూసే కోణాన్ని బట్టి తెలుస్తుంది. అలాంటి పరిస్థితులను ఈ సినిమాలో చూపించాం. సోషల్ మెసేజ్ ఉన్న సినిమా. ప్రేక్షకులను తప్పకుండా ఆలోచింపచేస్తుంది.

కార్తికేయ ఈ మూడు నాలుగేళ్లుగా ఈ సినిమాతో ట్రావెల్ అవుతున్నారు. నాతో పాటు యూనిట్ అంతా ట్రావెల్ అవుతూ చేసిన మంచి ప్రయత్నమిది’’ అన్నారు. చిత్ర దర్శకుడు కార్తికేయ.వి మాట్లాడుతూ ‘‘న్యూస్ పేపర్‌లో ఓ విషయాన్ని చదివి ఆ ఆలోచనతో విజయవాడ వెళ్లాను. అక్కడ లారా అనే వ్యక్తి గురించి విషయాలను సేకరించి దాన్నుండి తయారుచేసు కున్న కథ. ఇలాంటి ఓ కథను రియలిస్టిక్‌గా కనపడుతూనే కమర్షియల్ పంథాలో ఉండేలా పరుచూరి బ్రదర్స్‌గారు నాకు సహాయం చేశారు. తనీశ్ ఎంతగానో కష్టపడ్డారు. ఆయన కష్టం రేపు తెరపై కనపడుతుంది.  నిర్మాతలు ఎ.పద్మనాభ రెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నాకు డైరెక్టర్‌గా జన్మనిచ్చారు’’ అన్నారు. నిర్మాత ఎ.పద్మ నాభరెడ్డి మాట్లాడుతూ ‘‘కృష్ణానగర్‌లో ఆకలిని మరచిపోయి ఆశయం కోసం తిరిగే ఎంతో మంది దర్శకులున్నారు. అటువంటి వారి ఆశయాన్ని బ్రతికించడానికి ఈ సంస్థను స్థాపించాం. ఈ ‘రంగు’ సినిమా ద్వారా ఓ మంచి ప్రయత్నం చేశాం’’ అన్నారు. 

English Title
thaneesh movie
Related News