ఆమె కన్నీటితో నా చొక్కా తడిచిపోయింది

Updated By ManamThu, 09/20/2018 - 12:56
Thaman

Thamanఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఈ చిత్రం నుంచి మొత్తం పాటలు ఇవాళ విడుదల కానుండగా.. బుధవారం పెనిమిటి అనే పాటను రిలీజ్ చేశారు. బిడ్డ చేతిలో పడగానే భర్త తనకు దూరమైతే ఆ ఇల్లాలి బాధ ఎలా ఉంటుందో తెలుపుతూ వచ్చిన ఈ పాట అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తోంది.

రామ జోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం, దానికి థమన్ అందించిన సంగీతం.. ఈ రెండింటికి కాల భైరవ అందించిన స్వరం వినేవారిని మళ్లీ మళ్లీ వినేలా చేస్తోంది. ఇక ఈ పాటను విన్న సంగీత దర్శకుడు థమన్ తల్లి బోరున ఏడ్చేసిందట. ఈ విషయాన్ని థమన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇక్కడ మా అమ్మ. పెనిమిటి పాట విన్నాక నన్ను తన గదిలోకి పిలిచింది. నేను వెళ్లగానే నన్ను పట్టుకొని ఏడ్చేసింది. ఆమె కన్నీటితో నా చొక్కా మొత్తం తడిచిపోయింది. ఈ పాట వినగానే ఓ తల్లి కంట్లో నుంచి వచ్చిన నిజమైన భావం అది. ప్రపంచంలో అమ్మకు మించింది ఏదీ లేదు అంటూ ట్వీట్ చేశాడు.

కాగా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో అరవింద సమేత తెరకెక్కుతోంది. ఇందులో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. నాగబాబు, ఈషా రెబ్బా, సునీల్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్‌ నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రేజీ కాంబోగా తెరకెక్కడం.. విడుదలైన టీజర్, పాటలు అందరినీ ఆకట్టుకోవడంతో ఈ చిత్రంపై చాలా అంచనాలే ఉన్నాయి.

 

English Title
Thaman shared emotional moment with his mother about Penimiti song
Related News