ఆ 18 రోజులు ఎలా గడిపామంటే..!

Updated By ManamThu, 07/19/2018 - 11:55
thailand

Thailand థాయ్‌ల్యాండ్‌లోని థామ్ లువాంగ్‌లో గుహలో చిక్కుకుపోయిన 12మంది విద్యార్థులు, ఒక కోచ్ 18 రోజుల తరువాత ప్రాణాలతో భయటపడ్డ విషయం తెలిసిందే. వీరందరినీ హాస్పిటల్‌లో చేర్పించగా.. తాజాగా కోలుకున్నారు. ఈ నేపథ్యంతో వీరు మీడియాతో మాట్లాడుతూ.. ఆ చీకటి రోజులు ఎలా గడిపారో వెల్లడించారు. డైవర్లు తమను గుర్తించడం అద్భుతమేనని, అన్నీ రోజులు గుహలో ఉన్న రాళ్ల నుంచి వస్తున్న స్వచ్ఛమైన నీటిని మాత్రమే తాగామని, ఆహారం తీసుకోలేదని ఓ పిల్లాడు తన అనుభవాలను పంచుకున్నాడు. ఇసుకలోనే పడుకున్నామని, బుద్ధుడి ప్రార్థనలు చేశామని, టైంపాస్ కోసం చక్కర్స్ ఆడామని వారు తెలిపారు. ఇక ఎప్పుడూ తాము తిండి గురించి ఆలోచించలేదని, ఎందుకంటే అలా ఆలోచిస్తే ఆకలి మొదలవుతుందని భయపడేవాడినని మరో విద్యార్థి తన అనుభవాన్ని వెల్లడించాడు.

అనంతరం కోచ్ మాట్లాడుతూ గుహను తవ్వి పడాలనుకున్నామని, బయటి నుంచి సాయం వస్తుందని ఊహించలేదని అన్నారు. ఇక ఈ రెస్య్కూ ఆపరేషన్‌లో ప్రాణాలు కోల్పోయిన థాయ్ నేవీ సీల్‌కు పిల్లలు నివాళి అర్పించారు. 

English Title
Thai cave boys recall battle to survive
Related News