కుక్కబెదిరిచ్చి.., చెప్పెత్కపోయిందట..!!

Updated By ManamSun, 06/24/2018 - 06:24
tg

imageఒప్పించ లేకపోయినప్పుడు గందరగోళం సృష్టించు...అనే సామె తను నాటి ఉద్యమ కాలం నుంచి నేటి నాలుగేండ్ల విభజనానంతర కాలంలో కూడా కొనసాగిస్తున్నరు ఆంధ్రా రాజకీయ నాయకులు. అడ్డదారుల్లో తప్ప రుజుమార్గంలో నడవడం చేతకాని ఆంధ్రా నాయకత్వం మద్రాసు నుంచి విడిపోయి సీదా విజయవాడ చేరుకోక, నీ ముక్కు ఎక్కడుందిరా అంటే తలకాయ చుట్టూ చేయి తిప్పి సూయించినట్టు.., కర్నూలు వయా హైదరాబాద్ మీంచి అరవ యేండ్లానంతరం నేడు అమరావతికి చేరుకున్నారు. ఈ మొత్తం పరిణామ క్రమంలో వాల్లు వొంకర టింకర బాటలనే కాదు భాషను కూడా వంకర టింకరగానే అనుసరిస్తున్నరు. ఇరు ప్రాంతాల ప్రజల నడుమ నిరంతరం విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే పన్నాగాలతో, ఆంధ్రాలో పాలనాపరమైన వైఫల్యాలను ఎప్పటిక ప్పుడు కప్పిపుచ్చుకుంటూ కాలం ఎల్లదీస్తున్నరు.

బెజవాడలో బలంగా వున్న కమ్యునిస్టులకు భయపడి కర్నూ లును రాజధానిగా ఎంచుకున్న అసమర్థ నాయకత్వానికి అక్కడ డేరాల్లో నాలుగురోజులు పాలన చేసేసరికి సరిపోయింది. పెట్టిన పొయ్యి కట్టిన కుంపటి అన్నట్టుగా అప్పటికే నిజాం అభివృద్ధి చేసి పెట్టిన హైద్రాబాద్ మీద వాల్ల కన్నుపడ్డది. అబద్ధపు ఒప్పందా లతో హైద్రాబాద్‌ను ఆక్రమించిన్రు. తమ చేతకానితనానికి అటు ఆంధ్రా ప్రజలను ఇటు తెలంగాణ ప్రజలను సర్వనాశనం చేసి ఆరు దశాబ్దాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనను భ్రష్టు పట్టిచ్చిన్రు. ఇటు స్వయం పాలనకోసం పోరాడుతున్న తెలంగాణ ప్రజల ఆకాం క్షలకు అడ్డపుల్ల వేస్తూ.. చిన్న రాష్ట్రాల వలన లాభాన్ని అర్ధం చేసు కోలేక.. హైద్రాబాద్‌ను వొదిలితే తమ అక్రమాలకు అడ్డపడుద్దని.. అడ్డగోలు మూర్ఖపు వ్యవహారాలను ముందలేసుకుని తెలంగాణను అడ్డుకునే కుట్రలకు పూనుకున్నరు. సీన్ కట్ చేస్తే... ఇవాల అమరా వతిల తేలిండ్రు.

నాలుగేండ్ల కాలంలో రొండు రాష్ట్రాల పాలనను ఎవరి పాలన ఎట్లా వున్నదో. ప్రపంచం ఎప్పటికప్పుడు పరిశీలించి మార్కు లేస్తున్నది. తెలంగాణకు తొంబై మార్కులొస్తే ఆంధ్రాకు అత్తెసరు మార్కులు కూడా వస్తలేవు. అది జీర్ణించుకోలేక పోతున్నరు చంద్ర బాబులు. అత్త తిట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినందుకు అన్న ట్టు.. అప్రతిహతంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ మీద చేత కాని కసిని పెంచుకుంటున్నరు. వందల కిలోమీటర్ల తీర ప్రాంతం.. అరువయేండ్ల నుంచి అవిరిచ్చుకున్న అధికారం, పారిచ్చికుంటున్న సాగు నీళ్లు... తెలంగాణ నోట్లె మట్టికొట్టి గుంజుకున్న ఉద్యోగాలు.. యివేవీ వారి చేతకాని పాలనకు ముసుగు వేయలేక పోయినయి. వీరి డొల్లతనం ఈ నాలుగేండ్ల పాలనలో రోజుకింత బయటపడు తున్నది. కేవలం నాలుగేండ్ల సమయంలోనే నలబై యేండ్ల అభివృద్ధిని చవిచూస్తున్న తెలంగాణ వొక వైపు..  హైద్రాబాద్ మీద పడి దోసుకతింటూ.. థర్టీ యీయర్స్ ఇండస్ట్రీ అని ప్రగల్భాలు పలికిన ఆంధ్రా నాయకత్వం తెలివి అమరావతి సాక్షిగా తెల్లారు తున్నది. విజయవాడను రాజధానిగా చేసుకుని రాజధాని పేరతో సమయం వృథాకాకుండా.. అందివచ్చిన సహజ వనరులను మాన వ వనరులను వినియోగిస్తూ అద్భుతమైన ప్రణాళికలు రచించు కోవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ దారితప్పి ప్రవర్తిస్తు న్నడు. ప్రజలకు యేంగావాల్నో వాటి గురించి ఆలోచించి కార్యా చరణలో పెట్టకుండా, ఉమ్మడి రాష్ట్రంలో వ్యవహరించినట్టు, మీడి యా ప్రచార ఆర్భాటాలతో రాజధాని అభూత కల్పనలతో సింగ పూర్ సిలికాన్ వాలీ అంటూ కల్లిబొల్లి కబుర్లతో అసలు పని వొదిలి పెట్టిన చంద్రబాబు యెన్నటికీ అందుబాటులోకి రాని ప్రజలకు అక్కెరలేని అమరావతిని ముందలేసుకుండు. విభజన చట్టంలో రాయని ప్రత్యేక హోదాను మొదట వద్దని ప్యాకేజీలు సాలు అని చిలక పలుకులు పలికిండు.

ప్రజలకు పనికివచ్చే వొక్క పని సక్కగ చేయలేక.. తోటోడు తొడగోసుకుంటాంటే నేను మెడ కోసుకుం టనని.. తీరా ఎన్నికల ముందు ప్రత్యేక హోదా నినాదాన్ని ముంద లేసుకుని మోదీతోని లొల్లి పెట్టుకుంటున్నడు. అట్ల కూడ  కేంద్రం తోని పోరాటం చేతకాక.. చేతులెత్తేసి ఇప్పుడు ప్రజల సెంటిమెంటును రగిలించేందుకు, తన నాయకులతో పిచ్చి కూతలు కూయిస్తు న్నడు. ఉద్యమ సమయంలో ప్రజలను సూటిపోటి మాటలతోని రెచ్చగొట్టినట్టు మల్ల అదే ఎత్తుగడలకు పదును పెట్టి.. తన చేతికాని తనాన్నించి ప్రజలను పక్కదారి పట్టించడానికి టీజీ వెంకటేశ్ అనే, కేకే అన్నట్టు, వో పిచ్చోన్ని ఎగదోస్తున్నడు. ఆంధ్రాకు ప్రత్యేక ప్యాకేజీ కోసం కేసీఆర్ పోరాడా లంట.. సిగ్గుండాలె ఆ మాట అనడానికి. అట్టగనక చేయలేకపోతే టిఆరెస్‌కు ఇబ్బందులు తప్పవంట... ఆంధ్రా వోట్లను పడనివ్వడంట.. జ్నానం వున్న యెవలైనా అట్ల మాట్లాడుతరా? మరి అటువంటి అజ్నానాన్ని ప్రోత్సహిస్తున్న చంద్రబాబును ఆంధ్రా ప్రజలు రానున్న ఎన్నికల్లో తరిమి కొట్టడం ఖాయం అనే సంగతి అర్థమైంది. అమెరికా ఎన్నికల కానించి నిన్న టి కర్ణాటక ఎన్నికల దాకా ఆంధ్రా ప్రజలేం తాము ఎట్లా చెప్తే అట్లా వింటరని, తమ కోసం తొడకోససుకుంటరనే పనికిమాలిన ప్రచారా నికి తెరలేపిన్రు. మోదీతో అంటకాగినన్నాల్లు కాగి ఆ తర్వాత తమ చేతకాని తనానికి కర్నాటక సెటిలర్లను అడ్డం పెట్టకోని వారి మీడియా వంధిమాగధులు బ్లాక్ మెయిల్‌కు పాల్పడే ప్రయత్నాలు చేసిండ్రు. కాగా అక్కడ వీరి పప్పులు వుడకలేదు,. అదే బ్లాక్ మెయిలింగ్ టెక్నిక్కులకు తెలంగాణ కేంద్రంగా పాల్పడే కుయుక్తుల్లో భాగమే టీజీ వెంకటేష్ కూతలు. అంటే వీల్ల చేతకాని తనానికి ఆంధ్రా సెటిలర్లు బలికావాలన్నమాట. మీది తెనాలి అంటే మాదీ తెనా లే అని పోలోమని యెంటపడుతారనే బ్రమలను కల్పించడం నిజంగా సిగ్గుచేటు.

తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో దేశాల్లో బతుకు తున్న ఆంధ్రా ప్రజలకు కూడా ఆత్మగౌరవముం టుందని కానీ, ఆంధ్రా ప్రజలకు కూడా రాజకీయ విషయాలు అర్తమైతయని గానీ, వా రికీ జ్నానమున్నదనే విషయం గానీ, వారికి నేతలుగా క్లెమ్ చేసుకుంటున్న అసమర్థ బాబులకు తెలవక పోవడంలో ఆశ్యర్యమే ము న్నది? వీరు ఆడిచ్చినట్టల్లా ఆడడానికి ఆంధ్రా ప్రజలు కీ ఇచ్చి వొది లిన మరబొమ్మలా.? కానీ.., వీల్ల రాజకీయ బతుకులన్నీ ఇటువంటి మందిని బ్లాక్మేల్ చేయి మనోల్లను బకరాలను చేయ్.. అనే విధానం మీదనే ఆధారపడి నడుస్తున్నవి. 

ఆంధ్రా ప్రజలను తన పాలనచేత వొప్పించడం చేతగాని బా బు వాల్లను మల్లీ గందరగోళానికి గురిచేయడానికి తొండి కూతలు కూయిస్తున్నడనమాట. అదీ చాలక తెలంగాణ రాష్ట్ర సమితి సెక్రటరీ జనరల్ సీనియర్ నాయకులు డాక్టర్ కే.కేశవరావును చెప్పలేని భాష లో దూషించడం ద్వారా తమ నీచత్వాన్ని మరోసారి బహిరంగ పరుచు కున్నరు. ఇదంతా ఉద్యమ సమయంలో మాదిరి మరోసారి ఎన్నికల ముందు గందరగోళం సృష్టించడానికి పన్నిన కుట్ర అని అర్తం చేసుకోవచ్చు. if you don't convince just confuse.. అనే సూత్రాన్ని చంద్రబాబు ముందలేసుకున్నట్టు టీజీ వెంకటేశ్ పిచ్చి కూతల ద్వారా స్పష్టమైతున్నది.

 బాబు గత నాలుగేండ్లుగా అనుసరిస్తున్న వ్యవహారాల ద్వారా చేతగాని పాలన అంటే యెట్టుంటదో ఈ పాటికే ఆంధ్రా ప్రజలకు అర్థమయింది. తెలంగాణ పాలన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతూ అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి చేరుకుం టున్న నేపథ్యంలో ఆంధ్రా బాబుల వోర్వలేనితనం అసహనం కూడా అదేరీతిలో విపరీతమైన స్థాయికి చేరుకుంటున్నది. హైద్రా బాద్‌లోని ఆంధ్రా సెటిలర్లను రెచ్చగొట్టి పబ్బం గడుపు దామను కుంటున్న యీ ఈవ్ టీజర్లకు ఇవాల తెలంగాణలో సెటిలైన ఆంధ్రా ప్రజలు తెలంగాణ పౌరులేనని అర్థం చేసుకోకపోవడం తెలివి తక్కువతనమే తప్ప మరోటి కాదు. తెలంగాణ వస్తే ఆంధ్రా సెటిలర్లకు హైద్రాబాద్‌లో రక్షణ వుండబోదని, ఉద్యమ సమ యంలో యీ చేతగాని నేతలు చేసిన బెదిరగొట్టే కూతలకు విలువ లేదని, తెలంగాణ పాలన ప్రారంభ దశలోనే సెటిలర్లు అర్థం చేసుకున్నరు. రోజురోజుకూ కేసీఆర్ పాలన మీద పెరిగిన వారి విశ్వాసం జీహెచ్‌యెమ్సీ ఎన్నికల్లో వారు ఆదరించిన తీరుతో ఉన్నత స్థాయికి చేరుకున్నది. తమకు హైద్రాబాద్‌లో హాని జరుగు తదని తమ ప్రాంత నాయకులే సృష్టించింది చేతగాని ప్రచారమేనని వారు స్పష్టంగా అర్ధం చేసుకున్నరు. చంద్రబాబు కంటే కేసీఆర్ పాలన వందబాల్లు నయం అనే సంగతి అర్థమైన వారికి హైద్రా బాద్ వొక బంగారుగుడ్లు పెట్టే బాతు అనే సంగతి కూడా అర్థమైంది. వాల్లు రోజుకో గుడ్డును మాత్రమే తినే తెలివికల్ల వాల్లు.

ఆడలేనోడు మద్దెల పలగ్గొట్టినట్టు.. ఆంధ్రాలో రోజురోజుకు పడిపోతున్న గ్రాఫును చూసి బెంబేలెత్తుతున్నది..బాబు బృందం. తెలం గాణలోని సెటిలర్లు వోట్లు తమ అయ్యజాగీరైనట్టూ.. వాటిని చూపెట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని భయపెట్టే దుందుడుకు చర్యలకు పూనుకుం టున్నరు. కుక్క బెదిరిచ్చి.. చెప్పు ఎత్తుక పోయిందంట. త మకు ప్రత్యేక హోదా సాధించుకోలేని చేతకాని తనాన్ని తెలంగాణ మీద రుద్దే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. విజ్నులైన సెటిలర్లు ఇ ప్పుడు అవకాశ వాద రాజకీయాలకు తావిచ్చే పరిస్థితిలో లేరు. శర వేగమైన అభివృద్ధితోపాటు వారికి శాంతియుత పాలన కేసీయార్ ప్రభుత్వం అందిస్తున్నది. అలాంటప్పుడు తెలంగాణలో అక్కరకు రాని ఆంధ్రా సెంటిమెంటును నెత్తికునేంత పిచ్చితనం టీజీ వెంకటేశ్ కు వున్నట్టు వాల్లకు లేదనేది స్పష్టం. కేసీఆర్ నాలుగేండ్ల పాలనలో ప్రాంతాలకు అతీతంగా ప్రజలు హైద్రాబాద్‌లో జీవనం సాగిస్తు న్నరు. టీజీ లాంటి వాల్ల విషపు కూతలు బ్లాక్ మేలింగ్ ప్రకటనలు ప్రశాంతంగా వున్న తెలంగాణను యేమీ చేయలేవనే సంగతి ఇప్పటికీ వారికి అర్థం చేసుకోకపోతే ఎర్రగడ్డ ఆసుపత్రి తప్ప వారిని ఎవరూ రక్షించలేరు.
- తెగువేరా

English Title
tg venkatesh colomn
Related News