పక్కలు తారుస్తున్న ప్రముఖ తెలుగు నిర్మాత

Updated By ManamThu, 06/14/2018 - 11:00
Telugu Producer arrested for Running Sex Racket With Actresses
  • తెలుగు నటీమణులతో అమెరికాలో వ్యభిచారం.. నిర్మాత, ఆయన భార్యను అరెస్ట్ చేసిన షికాగో పోలీసులు

Telugu Producer arrested for Running Sex Racket With Actressesహైదరాబాద్: తెలుగు నటీమణులను వలలో వేసి.. హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ప్రముఖ తెలుగు నిర్మాత కిషన్ మోదుగుమూడి అలియాస్ విభా జయమ్, ఆయన భార్య చంద్ర మోదుగుమూడిని షికాగో పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో నిర్వహించే భారత సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాల్లో తెలుగు నటీమణుల ఫొటోలను చూపిస్తూ పెద్ద సెక్స్ రాకెట్‌ను నడుపుతున్నట్టు అమెరికా పోలీసులు నిర్ధారించి వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి 42 పేజీల నివేదికను షికాగో జిల్లా కోర్టులో పోలీసులు సమర్పించారు. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నటీమణులను తాత్కాలిక వీసాల మీద అమెరికా రప్పించి వారి ద్వారా సెక్స్ రాకెట్‌ను నడుపుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

ఒక్కో క్లయింటు నుంచి 3000 డాలర్లు (సుమారు రూ.2.02 లక్షలు) దాకా వసూలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. తాత్కాలిక వీసాల మీద రప్పించిన సదరు నటులను డల్లాస్, న్యూ జెర్సీ, వాషింగ్టన్‌లలో నిర్వహించే సదస్సులకు తీసుకుని వెళ్లి.. అక్కడ విటులను ఆకర్షిస్తున్నట్టు పోలీసులు తమ నివేదికలో వెల్లడించారు. ఈ సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేస్తానని అన్నందుకు ఓ బాధిత నటిని సదరు నిర్మాత బెదిరించినట్టు తెలుస్తోంది. అంతేగాకుండా ఆమె పాస్‌పోర్ట్‌ను లాక్కుని బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్టు పోలీసులు నివేదికలో వెల్లడించారు. అయితే, బెదిరింపులు ఎక్కువైపోతుండడంతో బాధిత నటి ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని అరెస్ట్ చేసేందుకు వెళ్లగా వారు పరారయ్యారు. ఏప్రిల్‌లో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి ఇద్దరు పిల్లలను వర్జీనియాలోని శిశు సంరక్షణ గృహానికి తరలించారు. వాస్తవానికి ఓ వ్యాపారవేత్త అయిన ఆ నిర్మాత.. చిన్నచిన్నగా టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్థానం ఏర్పరచుకుని పలు హిట్ సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం పలు డబ్బింగ్ సినిమాలను తెలుగులో నిర్మిస్తున్నారు సదరు నిర్మాత. 

English Title
Telugu Producer arrested for Running Sex Racket With Actresses
Related News